చెర్రీ సినిమాపై కేసు

Update: 2015-10-06 07:30 GMT
రామ్ చరణ్ అండ్ టీం బ్రూస్ లీ సినిమా కోసం అష్టకష్టాలు పడి ఈ సినిమాని అనుకున్న సమయానికి విడుదల చేసే వరకూ తీసుకొచ్చారు. ఇందుకోసం చరణ్ ఏకంగా నిర్విరామంగా 17 గంటలపాటు సెట్స్ లోనే వున్నాడు. ఎన్ని జరిగినా ఏం లాభం ఇప్పుడీ సినిమాకు ఓ చికొచ్చి పడింది. తెలుగులో అంతా సవ్యంగానే వుంది. ఈ
గొడవంతా పొరుగు రాష్ట్రమైన తమిళంలోనే.

విషయానికొస్తే హీరోగా మారిన సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ అక్కడ బ్రూస్ లీ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్ సినిమా పేరూ బ్రూస్ లీ నే. అయినా విషయం తెలుసుకున్న చెర్రీ అండ్ కో బ్రూస్ లీ 2 పేరుతో తమిళ్ లో విడుదల చేస్తున్నారు. అయితే ఇది కూడా తమకు ఇబ్బంది కలిగించేదే అంటున్నారు తమిళ బ్రూస్ లీ నిర్మాత సెల్వకుమార్. నిజానికి తెలుగు కంటే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసుకున్నదీ, ఆ వెంటనే అనౌన్స్ కూడా చేసిందీ వీళ్ళే. ఇప్పుడొచ్చి బ్రూస్ లీ 2 అంటే ఎలా అని ఈయన తన గోడును వెల్లబోసుకున్నారు. టైటిల్ మాత్రమే కాకుండా ఈ రెండు సినిమాల్లోనూ కృతి కర్బంద నటిస్తుండటం మరింత గజిబిజిగా వుంటుందని సెల్వకుమార్ వేదన. ఓవైపు మన వాళ్ళు తమిళంలో రేపు పాటలను విడుదల చేసి ప్రమోషన్ పనులు చేసేందుకు చెన్నై చేరుకుంటున్న సమయంలో తెలుగు బ్రూస్ లీపై తమిళ నిర్మాత అక్కడి నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేశారట. ఇలాంటి విషయంలో తమిళ సోదరులు ఎంత నిక్కచ్చిగా వుంటారో తెలిసిందే. తీర్పు కూడా వారికి ఫేవర్ గానే వచ్చే అవకాశాముందట. మనవాళ్ళేం చేస్తారో...?
Tags:    

Similar News