తెలుగు చిత్రరంగంలో ఒక వెలుగు వెలిగిన సీనియర్ నటి గీతాంజలి (62) కన్నుమూశారు. దాదాపు 500 చిత్రాల్లో నటించిన ఆమె.. ఈ రోజు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో ఫిలింనగర్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆమె.. చికిత్స పొందుతున్న వేళలోనే మరణించారు. బుధవారం గుండెపోటు కారణంగా ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. రాత్రి 11.45 గంటల వేళలో ఆమెకు మరోసారి గుండెపోటు రావటంతో తుదిశ్వాస విడిచినట్లు చెబుతుననారు.
తెలుగుతో పాటు.. తమిళం.. మలయాళం.. హిందీ చిత్రాల్లో నటించిన ఆమె.. ఎన్టీఆర్ హీరోగా నటించిన సీతారాముల కల్యాణం చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. 1957లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. గీతాంజలిగా సుపరిచితులైన ఆమె అసలు పేరు మణి.
సీనియర్ నటిగా ఇటీవల నిర్మించిన సినిమాల్లోనూ నటించారు. ఆమె చివరి చిత్రం తమన్నా కథానాయికిగా నటించిన దటీజ్ మహాలక్ష్మిలో నటించారు. ఆమె నంది అవార్డు కమిటీలో సభ్యురాలిగా వ్యవహరించారు. చిత్ర రంగంలో తాను ఎంట్రీ ఇచ్చిన సీతారామ కల్యాణం చిత్రంలో సీత పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించారు.
కలవారి కోడలు.. డాక్టర్ చక్రవర్తి.. లేత మనసులు.. బొబ్బిలియుద్ధం.. కాలం మారింది.. శ్రీశ్రీ మర్యాద రామన్న.. నిర్దోషి.. ఇల్లాలు.. దేవత.. గూఢచారి 116.. గ్రీకు వీరుడు.. మాయాజాలం.. పూలరంగడు.. అవే కళ్లు.. సంబరాల రాంబాబు.. శారద.. తదితర చిత్రాల్లో నటించిన ఆమె తెలుగు చిత్రపరిశ్రమలో సీనియర్ నటిగా సుపరిచితులు.