అనుష్క నటించిన 'నిశ్శబ్దం' త్వరలోనే విడుదల కానుంది. ప్రచారకార్యక్రమాల్లో భాగంగా నిన్న 'నిశ్శబ్దం' ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అనుష్క ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి 15 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది. ఈ కార్యక్రమంలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఆసక్తికరమైన స్పీచ్ ఇచ్చారు.
మొదట 'స్వీటీ' కి సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నందుకు 'హ్యాపీ బర్త్ డే' చెప్పాడు. ఈ సందర్భంగా అనుష్కను మొదటిసారి చూసిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. 'శ్రీరామదాసు' షూటింగ్ సమయంలో అనుష్కను కలిసినట్టు వెల్లడించారు. నాగార్జునను కలిసేందుకు రాఘవేంద్రరావు వెళ్లారట. ఆ సమయంలో అక్కడ నాగార్జున.. పూరి జగన్నాధ్ ఉన్నారట. అప్పుడు నాగార్జున "డైరెక్టర్ గారు మీకు ఓ కొత్త హీరోయిన్ ను పరిచయం చెయ్యాలి" అంటూ "స్వీటీ" అని పిలిచారట. అనుష్క నెమ్మదిగా బేస్ మెంట్ నుంచి మెట్లు ఎక్కుతూ వచ్చిందట. "మొదట అనుష్క కళ్ళు కనిపించాయని.. తర్వాత ఫేస్ కనిపించింది. తర్వాత.." అని నవ్వుతూ తనదైన చిలిపిదనంతో అందరిని నవ్వులలో ముంచెత్తాడు.
అప్పుడే అనుష్క ను చూసి నువ్వు సౌత్ లోనే టాప్ హీరోయిన్ అవుతావని చెప్పారట. సరిగ్గా అలాగే అనుష్క టాప్ హీరోయిన్ గా అందరి అభిమానం సాధించిందని చెప్పాడు. అరుంధతి.. రుద్రమదేవి.. బాహుబలి.. భాగమతి.. లాంటి సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేసిందని అన్నారు. అనుష్క స్వీట్ గా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమేనని.. అయితే మంచి పాత్రలు అన్నీ అనుష్కను వెతుక్కుంటూ వచ్చాయని.. అది చాలా అరుదుగా జరుగుందని అన్నారు. పూరి జగన్నాధ్ హీరోయిన్లను ఎలా చూపిస్తారో అందరికీ తెలుసని ఓ అల్లరి నవ్వు నవ్వుతూ 'సూపర్' అనే సినిమా తో సూపర్ హీరోయిన్ ను పరిచయం చేసినట్టు మెచ్చుకున్నారు.
తనకు.. అనుష్కకు ఓ విషయంలో పోలిక ఉందని.. తనను మౌనముని అంటారని.. ఈ సినిమా విడుదలైన తర్వాత అందరూ స్వీటీని 'మౌన ముని కన్యక' అంటారని చెప్పుకొచ్చారు.