బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో విచారణ కొనసాగుతున్న కొద్దీ షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి. డ్రగ్స్ కు బానిసలుగా మారిన బాలీవుడ్ హై ప్రొఫైల్ సెలబ్రెటీలు.. డ్రగ్స్ పొందేందుకు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారని తేలింది.
డ్రగ్స్ అమ్మకందారుల నుంచి మత్తు పదార్థాలను కొనేందుకు క్రిప్టో కరెన్సీ ‘బిట్ కాయిన్’ను వాడుతున్నట్టుగా ఎన్సీబీ అనుమానిస్తోంది. డ్రగ్స్ లావాదేవీలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఇంటర్నెట్ లో డార్క్ వెబ్ ను ఉపయోగించినట్టు తెలుస్తోంది.
డార్క్ వెబ్ అంటే వరల్డ్ వైడ్ వెబ్ కు ప్రత్యామ్మాయం.. దీన్ని ఉపయోగించాలంటే ప్రత్యేక సాఫ్ట్ వేర్లు, కన్ఫిగరేషన్ సిస్టంలు ఉండాలి. మూడో కంటికి తెలియకుండా డార్క్ వెబ్ లో డ్రగ్స్ ఆర్డర్ చేస్తున్నట్టు ఎన్సీబీ గుర్తించింది. డ్రగ్స్ కు చెల్లింపులు చేసే విషయంలో ‘బిట్ కాయిన్’లను ఉపయోగిస్తున్నట్టు సమాచారం. క్రిప్టో కరెన్సీ ద్వారా లావాదేవీలు చేసినట్టు తెలుస్తోంది. బిట్ కాయిన్ల రూపంలో పేమంట్లు చెల్లించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఎన్సీబీ అదుపులో ఉన్న డ్రగ్ పెడ్లర్ శ్రేయాస్ నాయర్ ను ఇదే కోణంలో విచారిస్తున్నట్టు సమాచారం. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఒడిశాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 11కు చేరింది.
ఇక డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు మరింత ఉచ్చు బిగుస్తోంది. అక్టోబర్ 7వరకు ఎన్సీబీ కస్టడీలో ఉండాలని కోర్టు ఆదేశించడంతో ఆర్యన్ పై ప్రశ్నల వర్షం కురవడం ఖాయం. ఆర్యన్, అర్బాజ్, మున్ మున్ లను ఈనెల 11 వరకు ఎన్సీబీ కస్టడీలో ఉంచి ప్రశ్నించనుంది.