తక్కువ బడ్జెట్ లో తీసే చిన్న సినిమా అయినా భారీ మల్టీ స్టారర్ అయినా సెట్స్ పైకి వెళ్ళడానికి మంచి స్క్రిప్ట్ ప్రాణం లాంటిది. ఒకరకంగా చెప్పాలంటే సినిమా భవిష్యత్తుని శాసించేది అదే. కాకపోతే తాము రాసిందే కరెక్ట్ అనే అంచనాలో దర్శక రచయితలు తప్పొప్పులు చూసుకోకుండా షూటింగ్ కు వెళ్ళిపోతారు కాబట్టే ఏ బాషా పరిశ్రమలో అయినా సక్సెస్ శాతం తక్కువగా ఉంటుంది. ఒకరే అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏదోలా సర్దుకుంటూ మార్చుకుంటూ పోవచ్చు. కానీ ఒకే సినిమాకు నలుగురైదుగురు అగ్రజులు పని చేస్తే మాత్రం చిక్కులు తప్పవు. అయినా అశ్వనీదత్ ఇలాంటి పద్ధతినే ఎన్నుకుంటారు. దేవదాస్ కు రచన దర్శకత్వమని పైకి శ్రీరామ్ ఆదిత్య పేరు కనిపిస్తున్నప్పటికీ వెనకమాల పెద్ద టీమ్ ఉంది. ఈ విషయాన్నీ స్వయంగా అశ్వని దత్ చెప్పాకే బయటికి వచ్చింది. దేవదాస్ కు కథను రాఘవ శ్రీరామ్ అందిస్తే 90 దశకంలో బ్లాక్ బస్టర్స్ కు పనిచేసిన భూపతి రాజా దానికో రూపాన్ని ఇచ్చారు. అక్కడితో ఆగలేదు. సత్యానంద్ కూడా జాయినై కావాల్సిన మార్పులు చేర్పులు చేసారు.
సరే వస్తే వచ్చారు కథ బాగా వస్తుంది కదా అనుకుంటే బరువైన సీన్ల కోసం బుర్ర సాయి మాధవ్ ను కూడా టీమ్ లోకి తీసుకొచ్చారు. ఖైదీ నెంబర్ 150కి ఈయన ఇలాంటి స్కీం లోనే డైలాగ్స్ రాసారు. ఇందరు కలిసి కూర్చి చేతికిస్తే అప్పుడు గాని శ్రీరామ్ ఆదిత్యకు సెట్ మీదకు వెళ్లే ధైర్యం చేయలేదు కాబోలు. నిజానికి అశ్వని దత్ ఒక సినిమాకు రచయితల టీమ్ ను సెట్ చేసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఆయన నిర్మించిన ఆజాద్-అశ్వమేధం-జగదేకవీరుడు అతిలోకసుందరి-ఆఖరి పోరాటం లాంటి వాటికి జంధ్యాల-సత్యానంద్-యండమూరి లాంటి లబ్దప్రతిష్టులను ఒకేచోట చేర్చి తను కోరుకున్న విధంగా ఫైనల్ వెర్షన్ వచ్చే దాకా ఆగేవారు. దేవదాస్ కు సైతం అదే ఫార్ములా ఫాలో అయిపోయారు. మరి ఇందరు కష్టపడ్డారు అంటే దానికి తగ్గ ఫలితం అందుకున్నారో లేదో ఈ 27న తేలిపోతుంది. రేపు ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరగనుంది.