నటుడుగా కెరియర్ మొదలుపెట్టి, ఫిల్మ్ ఇండస్ట్రిలోకి వచ్చి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు షారూక్. ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది.. కోట్లాది మంది గుండెలో కింగ్ లాంటి స్థానం ఉంది. దేశం పద్మంతో గౌరవించింది.. ఇతర దేశాలు వాళ్ళు కూడా అత్యున్నత సివిల్ అవార్డులు తోను గౌరవించారు. ఒక సాధా కుర్రాడు ఊహించిన దాన్ని కంటే ఎక్కువే సాధించాడు. ప్రపంచం లోనే ఫేమస్ నటులలో ఒకడు గా గుర్తింపు పొందాడు. చాలా యునివర్సిటిలు డాక్టరేట్ కూడా ఇచ్చాయి. ఇన్ని సాధించిన షారూక్ ఖాన్ కి కొన్ని సార్లు అవమానాలు కూడా జరిగాయి.
షారూక్ లాంటి వాడిని అమెరికా ఎయిర్ పోర్ట్ లో ఆపి చిన్న బుచ్చారు కూడా. ఇప్పుడ్ మరో సారి అమెరికా అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ వాళ్ళు ఎంపిక చేసుకున్న ప్రపంచ నటుల కొత్త మెంబర్షిప్ లిస్ట్ లో మన బాలీవుడ్ నటులు చాల మంది పేర్లు ఉన్నాయి కానీ షారూక్ ఖాన్ పేరు లేదు. అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అనేది ఆస్కార్ అవార్డ్ సంస్థలో ఒక భాగం, ప్రతి ఏడాది కొత్త నటులు భాగస్వామ్యం కోసం ఒక లిస్ట్ ని తయారు చేస్తారు. అలా చేసిన వాళ్ళని అకాడెమీ లోని భాగమవ్వమని ఆహ్వానం అందిస్తారు. ఈ సారి కూడా 774 మందిని ఆహ్వానించారు. అందులో అమితాబ్ బచ్చన్ - ప్రియాంకా చోప్రా - దీపికా పడుకొనే - ఐశ్వర్యా రాయ్ బచ్చన్ - ఇర్ఫాన్ ఖాన్ - అమీర్ ఖాన్ - సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళకి పిలుపు వచ్చింది కానీ షారూక్ ఖాన్ కు రాలేదు. వాళ్ళు పెట్టుకున్న అర్హత ఏంటి అంటే “మోషన్ పిక్చర్స్ లో కానీ థియేటర్ ఆర్ట్స్ లో కానీ చెప్పుకోతగ్గ పనిచేసి ఉన్నవారికి ఎంపిక చేస్తాం'' అని అంటున్నారు.
ఇక్కడే పాపం అభిమానులు మనోభావాలు దెబ్బతిన్నాయి. దీపికా పడుకొనే లాంటి వారికి లిస్ట్ చోటు ఉన్నప్పుడూ షారూక్ లాంటి నటుడుకి లేకపోకడం నిజంగానే ఆ అకాడెమీ లిస్ట్ స్థాయి గురించి ఆలోచించవలిసిందే. వీళ్ళు కిందటి ఏడాది 683 మందికి పంపితే ఈ సారి 774 మందికి పంపారు. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/