పిల్ల‌ల కోసం 40 సార్లు చూశాడ‌ట‌

Update: 2019-07-17 07:53 GMT
యానిమేష‌న్ 3డి సినిమా `ది ల‌య‌న్ కింగ్` ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్. `ది జంగిల్ బుక్` సంచ‌ల‌న విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని డిస్నీ సంస్థ ఇండియాలోనూ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేస్తోంది. ఈనెల 19న ఇంగ్లీష్ స‌హా తెలుగు-హిందీ-త‌మిళం భాష‌ల్లోకి అనువ‌దించి ఈ చిత్రాన్ని దేశ‌విదేశాల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా  వేలాది థియేట‌ర్ల‌లో ఈ చిత్రం రిలీజ‌వుతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ఆడియెన్ లో ఎంతో ఆస‌క్తిని పెంచింది. టీజర్ ట్రైల‌ర్... పోస్ట‌ర్లు ప్ర‌తిదీ క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఈ సినిమాకి షారూక్ .. ఆయ‌న వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ హిందీ వెర్ష‌న్ లో కీల‌క పాత్ర‌ల‌కు అనువాదం చెప్పారు. జంగిల్ కింగ్ ముసాఫా (తండ్రి) పాత్ర‌కు షారూక్.. సింబా (కిడ్) పాత్ర‌కు ఆర్య‌న్ డ‌బ్బింగ్ చెప్పారు. అందుకే ఈ సినిమాని ఒక‌సారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా 40 సార్లు చూశాడ‌ట షారూక్. అన్నిసార్లు ఎందుకు చూడాల్సి వ‌చ్చింది? అంటే అది త‌న పిల్ల‌ల‌కోస‌మేన‌ని చెప్పారు కింగ్ ఖాన్. ఈ సినిమాకి పెద్ద కుమారుడు ఆర్య‌న్ ఖాన్ తో క‌లిసి డ‌బ్బింగ్ చెప్పే స‌మ‌యంలో సుహానాఖాన్ .. ఏబీరామ్ ల‌తో క‌లిసి సినిమాని వీక్షించాన‌ని తెలిపాడు. త‌న ఇంటి బెడ్ రూమ్ నే ఏకంగా లైవ్ థియేట‌ర్ గా మార్చేశాన‌ని షారూక్ వెల్ల‌డించారు. ది ల‌య‌న్ కింగ్ కి డ‌బ్బింగ్ చెప్పే క్ర‌మంలో కొద్ది కొద్దిగానే కొన్నిసార్లు సినిమా చూడాల్సి వ‌చ్చింద‌ని ... ప్ర‌తిసారీ పిల్ల‌ల‌తో క‌లిసి సినిమాని వీక్షించేందుకు ఇంటినే హోమ్ థియేట‌ర్ గా ఉప‌యోగ‌ప‌డింద‌ని.. పిల్ల‌ల‌తో క‌లిసి పిజ్జాలు-దోసెలు తింటూనే చేసే ప‌నిని ఆస్వాధించాన‌ని వెల్ల‌డించారు.

పిల్ల‌ల‌తో క‌లిసి కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా ఏది? అని ప్ర‌శ్నిస్తే ది ల‌య‌న్ కింగ్ బెస్ట్ అని షారూక్ అన్నారు. త‌న కుటుంబంతో క‌లిసి ఏదో ఒక చోట ఈ సినిమా రిలీజ‌య్యాక వీక్షిస్తాన‌ని షారూక్ అన్నారు. `ది జంగిల్ బుక్` ఫేం జాన్ ఫావ్ రూ.. `ది ల‌య‌న్ కింగ్` పేరుతో మ‌రో కొత్త ప్ర‌పంచాన్ని క్రియేట్ చేశారు. ఆయ‌న ఊహాప్ర‌పంచం ఎంతో గొప్ప‌గా తెర‌కెక్కిందని తెలిపారు. లైవ్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ కేట‌గిరీలో 2డి-3డిలో ది ల‌య‌న్ కింగ్ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని.. ఇండియా నుంచి దాదాపు 300-500 కోట్లు కొల్ల‌గొట్టే ఛాన్సుంద‌ని ట్రేడ్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే ఆన్ లైన్ టికెటింగ్ విండో జోరుపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

    

Tags:    

Similar News