ఫోర్బ్స్ జాబితాలో నెం.1 కింగ్ ఖాన్!

Update: 2017-08-31 11:18 GMT
బాలీవుడ్ లో ఒక‌ప్పుడు ఖాన్ త్ర‌యం హ‌వా న‌డిచేది. కొద్ది కాలంగా మిగిలిన హీరోలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను సాధిస్తూ ఖాన్ త్ర‌యానికి గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా అక్ష‌య్ కుమార్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. అయితే, బాలీవుడ్ స్టార్ హీరోల ఆదాయాల్లో మాత్రం ఖాన్ త్ర‌యం టాప్ 4 లో నిల‌వ‌డం విశేషం. త‌మ‌ తాజా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ షారుక్‌ - స‌ల్మాన్ లు టాప్ 1 - 2 గా నిలిచారు. ఫోర్బ్స్ ప్ర‌క‌టించిన అత్య‌ధిక పారితోష‌క హీరోల జాబితాలో వీరిద్ద‌రూ ప్ర‌థ‌మ‌ - ద్వితీయ స్థానాల‌ను సొంతం చేసుకున్నారు.  బాలీవుడ్ లో హయ్యెస్ట్ రెమ్యున్ రేష‌న్ తీసుకుంటున్న‌ హీరోల జాబితాను ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది.

త‌న తాజా చిత్రం జ‌బ్ హ్యారీ మెట్ సెజ‌ల్ చిత్రం డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ ఈ సంవత్సరం కింగ్ షారూక్ ఖాన్ తొలి స్థానంలో నిలిచాడు.  'రయీస్' చిత్రంతో పాటు పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న షారుక్‌ 38 మిలియన్ డాలర్లు సంపాదించాడ‌ట‌. ట్యూబ్ లైట్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ న‌మోదు చేసిన స‌ల్లూ భాయ్‌ రెండో స్థానంలో నిలిచాడు. 'భజరంగీ భాయిజాన్'తో హిట్ కొట్టిన సల్మాన్ ఖాన్ 37 మిలియన్ డాలర్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక టాయిలెట్ వంటి వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ 35.5 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అయితే, ఆశ్చ‌ర్య‌కరంగా దంగల్ హీరో మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ అమీర్ ఖాన్‌ కేవలం 12.5 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానంలో 11.5 మిలియన్ డాలర్లతో హృతిక్ రోషన్ - ఆరో స్థానంలో 11 మిలియన్ డాలర్లతో దీపికా పడుకొనే - ఆపై 10 మిలియన్ డాలర్ల ఆదాయంతో రణవీర్ సింగ్ - ప్రియాంకా చోప్రా 7వ స్థానాన్ని పంచుకున్నారు. అమితాబ్ బచ్చన్ - రణబీర్ కపూర్ లు 9 - 10వ స్థానాల్లో ఉన్నారని ఫోర్బ్స్ తెలియజేసింది.
Tags:    

Similar News