సూపర్ స్టార్ ని కలిసిన షారూక్

Update: 2017-08-16 05:13 GMT
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ కి ఉన్నవి రెండే కుటంబాలు అని చెబుతూ ఉంటాడు.  అవి ఒకటి తన సొంత కుటంబం రెండోది సినిమా పరిశ్రమ. బహుశా ఇండస్ట్రిలో షారూక్ అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరు ఉండకపోవచ్చు. అందరితో స్నేహంగా ఉంటూ తన ముందు తరాల హీరోలు అంటే భక్తి భావంతో ఉంటూ అందరి ప్రేమను గెలిచాడు. ఇప్పుడు  హింది సినిమా తొలి మెగాస్టార్ కు  ఆరోగ్యం చెడితే  అతన్ని చూడటానికి వెళ్ళి ఆయనతో కొంత సమయం గడిపి అందరి అభిమానం గెలుచుకున్నాడు షారూక్ ఖాన్.

సీనియర్ మెగాస్టార్ దిలీప్ కుమార్ అంటే షారూక్ ఖాన్ కు చాలా ఇష్టం. అదే మాట కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాడు షారూక్. దిలీప్ కుమార్ ఇప్పుడు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా హాస్పిటల్ లో ఉంది చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం స్తిరంగానే ఉంది. అయితే తన ఆరాధ్య నటుడు అలా ఉండే సారికి మనసు ఉండబట్టలేక వెళ్ళి కలిసి పలకరించి వచ్చాడు. వస్తు వస్తు తన ప్రేమను తెలుపుతూ నుదిటపై ఒక ముద్దు పెట్టుకున్నాడు. “నా జీవితంలో ఇంత గొప్ప వ్యక్తిని చూడలేదు. ఆయన గొప్ప నటుడే కాదు ఇండస్ట్రికి ఉన్న ఏకైక పెద్ద దిక్కు. మన హింది సినిమాకు ఆదిగురువు'' అని కితాబు ఇచ్చాడు.

షారూక్ ఖాన్ అంటే దిలీప్ కుమార్ కు కూడా అంతే  ఇష్టం అని చెబుతూ ఉంటారు. జబ్ హ్యారి మెట్ సెజల్ సినిమా ఫ్లాప్ తరువాత షారూక్ తీవ్ర విమర్శలు పాలైయ్యాడు. ఇప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో కొత్త సినిమా షూటింగ్ చేయడంలో బిజీ అయ్యాడు. డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్లుగా కత్రినా కైఫ్, అనుష్క శర్మా నటిస్తున్నారు.​
Tags:    

Similar News