హీరో మొదటి శుభలేఖ మాజీ లవర్‌కే

Update: 2015-06-25 07:30 GMT
సాధారణంగా ఒక్కసారి బ్రేకప్‌ అయ్యాక మళ్లీ తన మాజీ లవర్‌ను కలవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. సినిమా వాళ్లయినా సరే.. ఇందుకు మినహాయింపు కాదు. కానీ బాలీవుడ్‌ మాజీ లవర్స్‌ షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌లను మాత్రం దీనికి మినహాయింపుగా చెప్పాలి. బ్రేకప్‌ అయ్యాక కూడా ఇద్దరూ కలిసి ఓ సినిమా చేశారు. ఇప్పుడింకో సినిమా కూడా చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కనబెడితే.. షాహిద్‌తో బ్రేకప్‌ అయ్యాక కరీనా సైఫ్‌ ప్రేమలో పడి.. అతణ్నే పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లయి కూడా దాదాపు మూడేళ్లు అవుతోంది.

షాహిద్‌ కూడా కరీనాతో బ్రేకప్‌ తర్వాత కొన్ని ప్రేమాయణాలు నడిపాడు. ఇప్పుడు సినీ రంగంతో సంబంధం లేని ఓ అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. ఇంతకీ ఈ పెళ్లికి కరీనాను పిలుస్తాడా లేదా అంటూ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. తన పెళ్లికి షాహిద్‌ను పిలవని కరీనా.. అతను పిలిస్తే మాత్రం తప్పకుండా పెళ్లికి వెళ్తానంటూ ఆసక్తికర స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఐతే ఆమెను షాహిద్‌ పెళ్లికి పిలిచాడు. అది కూడా తన మొదటి పెళ్లి శుభలేఖను పట్టుకెళ్లి కరీనాకే ఇచ్చాడట షాహిద్‌. సైఫ్‌ ఇంటికెళ్లి కుటుంబ సమేతంగా పెళ్లికి రావాలని ఇన్విటేషన్‌ ఇచ్చి వచ్చాడట షాహిద్‌. తన మాజీ ప్రేయసికి షాహిద్‌ ఎంత ప్రయారిటీ ఇచ్చాడో చూశారా!

Tags:    

Similar News