బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. పబ్లిక్ లో సిగరెట్లు తాగి ఫైన్ కట్టడం వంటివాటిని ఎలా ఉపయోగించుకోవాలో షారూక్ కి బాగానే తెలుసు. పైగా ఈ బాలీవుడ్ బాద్షా పర్ఫెక్ట్ ప్లానింగ్ కారణంగా.. ఎవరికీ సారీ చెప్పాల్సిన అవసరం రాదట. ఒకవేళ చెప్పాల్సి వచ్చినా చెప్పే మెంటాలిటీ కూడా కాదని ఓ టాక్.
అయితే.. రీసెంట్ గా మాత్రం షారూక్ ఖాన్ తనంతట తానే ఒక వ్యక్తికి సారీ చెప్పేశాడు. అది కూడా తన సినిమా ఫీల్డ్ కు చెందిన వ్యక్తికి కాకపోవడం మరీ విశేషం. టెడ్ టాక్స్- ఇండియా కార్యక్రమానికి షారూక్ హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ లో షారూక్ ఖాన్ తో పాటు దర్శకుడు కరణ్ జోహార్.. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ లు కూడా పాల్గొన్నారు. "ఛేంజింగ్ రిలేషన్ షిప్స్" అంటూ మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులపై ఈ టెడ్ టాక్ నిర్వహించారు. కానీ అసలు సారీ విషయం ఏంటంటే.. ఈ కార్యక్రమానికి అనుకున్న సమయం కంటే ఆలస్యంగా వచ్చారు షారూక్ అండ్ కరణ్.
కాస్తా కూస్తా ఆలస్యం కాదు.. ఏకంగా మూడు గంటలకు పైగా మిథాలీ వెయిట్ చేయాల్సి వచ్చిందట. దీంతో తన తప్పు గ్రహించిన షారూక్.. వచ్చీ రాగానే తనంతట తానే మిథాలీ దగ్గరకు వెళ్లి.. మనస్ఫూర్తిగా క్షమించమని అడిగాడట. ఎందుకు ఆలస్యం అయిందనే విషయాన్ని కూలంకషంగా వివరించాడట. అంతే కాదు.. మిథాలీ రాజ్ ఇవ్వాల్సిన స్పీచ్ కు సంబంధించి బోలెడంత సాయం కూడా చేశాడట షారూక్ ఖాన్. ఆమె కంఫర్ట్ గా ఫీల్ అయ్యే వరకూ వెయిట్ చేసి.. ఆ తర్వాతే కార్యక్రమం ప్రారంభించారట వీరంతా.