ఈ ఖాన్స్ కామెడీలు చూస్తే నవ్వు రావట్లే!!

Update: 2016-07-08 09:30 GMT
మొన్ననే అమీర్‌ ఖాన్‌ ను.. మిగతా ఇద్దరు ఖాన్స్ తో పోల్చుకుంటే మీలో ఎవరు బెటర్‌ అనగానే.. నాదేముంది చోటా రేంజ్ అన్నాడు. తరువాత షారూఖ్ ఖాన్‌ కూడా ఇదే తంతు. నాదేముంది వాళ్ళిద్దరూ టాప్‌ అన్నారు. ఇక సల్మాన్ భాయ్‌ మీడియాతో మాట్లాడలేదు కాని.. సుల్తాన్‌ సినిమాతో ఆధిపత్యం చూపిస్తున్నాడు. తనని అడిగినా కూడా.. నాదేముంది వాళ్ళే టాప్‌ అంటాడేమోలే.

నిజానికి ఈ ముగ్గురూ చెబుతున్న ఈ విషయాలన్నీ మనం నమ్మొచ్చా? అసలు వీళ్ళు చెబుతున్న ఈ సింపుల్ మాటలన్నీ కేవలం సోదే అని మీడియాలోని చాలామంది క్రిటిక్స్ ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? సంవత్సరానికి దాదాపు 300 కోట్లు సంపాదిస్తున్నాడు షారూఖ్‌ ఖాన్‌. కాకపోతే తీసే సినిమాలన్నీ కూడా రొటీన్‌ మసాలా మూవీసే. ఇక చారిటీ ఏమన్నా చేస్తున్నాడో లేదో తెలియదు. వినూత్నంగా సినిమాలను తీస్తూ.. దాదాపు తన సినిమాలన్నీ తానే ప్రొడ్యూస్ చేసుకుంటూ.. అదో రేంజ్‌ స్టార్డమ్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు అమీర్‌ ఖాన్‌. తనకు నచ్చని నటుడిని కాని.. తన మీద పంచ్ వేసిన హీరోయిన్ ను కాని తన సినిమాలో పెట్టుకోకపోవడం మాత్రమే కాదు.. తన సినిమా ప్రీమియర్‌ కు కూడా పిలువడు. ఇక సల్లూ భాయ్‌ గురించి పెద్దగా మనం చెప్పేదేముంది. 20 కోట్లు ఖర్చు పెట్టినా రాని పబ్లిసిటీ.. ఒకే ఒక్క రేప్ కామెంట్ తో సుల్తాన్‌ సినిమాకు కావల్సినంత వచ్చేసింది.

ఇన్నేసి పనులు చేస్తున్న ఈ ముగ్గురూ.. చాలా సింపుల్ గా నాకంటే వాళ్లే గొప్ప.. నాదేముంది నిమిత్త మాత్రుడిని అంటే.. అది కామెడీ కాకపోతే మరేంటి? ఒకవేళ కామెడీ అనుకున్నా కూడా.. నవ్వు మాత్రం రావట్లేదు గురూ!!
Tags:    

Similar News