జబర్దస్త్ ఎఫెక్ట్.. ఇంకో బ్యాచిలర్ కథ ముగిసె

Update: 2016-04-23 07:54 GMT
జబర్దస్త్.. తెలుగు టెలివిజన్ రంగంలో ఓ సెన్సేషన్. ఈ ప్రోగ్రాం చాలామంది చోటా కమెడియన్ల జీవితాల్ని మార్చేసింది. ఈ ప్రోగ్రాం ద్వారా పదుల సంఖ్యలో టాలెంటెడ్ కమెడియన్లు జీవితంలో నిలదొక్కుకున్నారు. ధనరాజ్.. చమ్మక్ చంద్ర.. సుడిగాలి సుధీర్.. చలాకీ చంటి.. షకలక శంకర్.. లాంటి వాళ్ల జీవితాల్ని ‘జబర్దస్త్’ మార్చేసింది. ఈ ప్రోగ్రాం ద్వారా పేరు.. డబ్బు రెండూ సంపాదించడమే కాదు.. పెళ్లి చేసుకుని జీవితంలోనూ స్థిరపడ్డారు వీళ్లలో కొందరు. ఈ మధ్యే చలాకీ చంటి పెళ్లి చేసుకోవడం తెలిసిందే. తాజాగా షకలక శంకర్ కూడా ఓ ఇంటివాడైపోయాడు.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన శంకర్.. ఆ జిల్లాలో చాలా ఫేమస్ అయిన అరసవల్లి దేవాలయ సన్నిధిలో పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా శుక్రవారం రాత్రి శంకర్ పెళ్లి జరిగింది. తన మేనమామ కూతురు పార్వతిని అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి మొక్కు కారణంగానే అరసవల్లిలో పెళ్లి చేసుకున్నాననన్నాడు. తన తోటి నటులెవరినీ ఈ పెళ్లికి ఆహ్వానించలేదన్నారు. కోట్లాది మంది మొక్కే ప్రత్యక్షదైవమైన ఆ సూర్యనారాయణ స్వామి సన్నిధిలో కల్యాణ చేసుకోవడం  ఆనందంగా ఉందన్నాడు. తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ప్రణాళిక రచించుకున్నానని.. తాను పదో తరగతి వరకు చదువుకున్న హాస్టల్లో పిల్లల కోసం దుస్తులు.. క్రికెట్ కిట్లు ఇస్తానని చెప్పాడు. పెళ్లి ఆర్భాటంగా చేసుకోవడం కంటే ఇలాంటి సేవా కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెట్టడం మంచిదన్నాడు. తాను ప్రస్తుతం 15 సినిమాల్లో నటిస్తున్నట్లు శంకర్ చెప్పాడు.
Tags:    

Similar News