మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ ఎంటర్ టైనర్ 'ధమాకా'. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్నా భారీ ఓ పెనింగ్స్ ని రాబట్టి అశ్చర్యపరిచింది. అంతే కాకుండా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతూ యునానిమస్ గా సూపర్ హిట్ అనిపించుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇటీవలల సక్సెస్ సెలబ్రేషన్స్ ని నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్ లో బండ్ల గణేష్ పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా తను చేసిన వ్యాఖ్యలపై కమెడియన్ షకలక శంకర్ తాజాగా కౌంటకర్ ఇచ్చాడు. బండ్ల గణేష్ గత కొంత కాలంగా సినిమా ఈవెంట్ లకు దూరంగా వుంటూ వస్తున్నాడు. ఆ మధ్య ఆకాష్ పూరి నటించిన 'చోర్ బజార్' ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొని పూరి జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం, అవి వివాదానికి దారి తీయడం తెలిసిందే. బండ్ల గణేష్ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకున్నాడంటే అతనికి పూనకం వస్తుందని, ఓ రేంజ్ లో ప్రత్యర్థులకు కౌంటర్లు వేస్తూనే అక్కడున్న వారిని తన స్పీచ్ తో బండ్ల గణేష్ కడుపుబ్బా నవ్విస్తుంటాడు.
ఇక పవన్ కల్యాణ్ సినిమా ఫంక్షన్ అయితే బండ్ల గణేష్ కి పండగే. దీంతో ఫ్యాన్స్ బండ్ల గణేష్ స్పీచ్ ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇదిలా వుంటే 'ధమాకా' సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న బండ్ల గణేష్ ..రవితేజపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'ఎప్పటికీ అస్తమించని రవితేజ గురించి మాట్లాడాలని వచ్చాను. రవితేజ ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు..రవితేజ హానెస్టీ, సిన్సియారిటీ, రెస్పాన్సిబులిటీ, రవితేజ ఎవ్రీథింగ్ ఫర్ ఆన్సర్ బులిటీ..రవితేజ ఫ్యాన్స్ అని చెప్పుకోవడానికి గర్వం వుండాలి అన్నాడు.
అంతే కాకుండా రవితేజ చేసిన 70 సినిమాల్లో 12 మంది కొత్త దర్శకులని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ.. కష్టం తెలిసిన వాడు రవితేజ..అందరూ వన్ ఇయర్, టు ఇయర్.. త్రీ ఇయర్స్ ట్రై చేస్తారు...అదృస్టం కలిసొచ్చి సూపర్ స్టార్లు, మెగాస్టార్లు కూడా అవుతారు.. అంటూ బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మెగాస్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్ బండ్లన్నపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. బండ్ల గణేష్ వ్యాఖ్యలపై కమెడియన్ షకలక శంకర్ కౌంట్ ఇచ్చాడు.
కొంత మంది మైక్ తీసుకుని ఏం మాట్లాడతారో అర్థం కావడం లేదు. నిన్న మొన్నో ఓ ప్రొడ్యూసర్ మాట్లాడాడు. ఏదో రెండు సంవత్సరాలు.. మూడు సంవత్సరాలు ట్రై చేస్తే సూపర్ స్టార్ లు, మెగాస్టార్ లు అయిపోతారన్నాడు. సూపర్ స్టార్ లు, మెగాస్టార్ లు అదృష్టం కొద్దీ కావడం లేదు. వాళ్లకు ఆ స్టార్ డమ్ రావడానికి ఎన్నో సంవత్సరాలు రాత్రులు, పగలు తిండిలేక, నిద్రలేక ఎన్నో కష్టాలు పడితే స్టార్స్ అయ్యారు.
అనేవాడికి అర్థమవ్వాలి ఫస్టు. తను ఎందుకన్నాడో ఎదురుగా ఓ హీరో వుంటే ఉబ్బిపోయి తబ్బిపోయి.. మై మరిచిపోయిఇండస్ట్రీని నిలబెట్టిన మహానుభావుల గురించి నువ్వంత చులకనగా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ బండ్ల స్పీచ్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన తీరు నెట్టింట వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.