జిఎస్టి సీక్వెల్ కు సై అన్న షకీలా

Update: 2018-01-31 11:17 GMT
రామ్ గోపాల్ వర్మ మియా మల్కొవాతో చేసిన జిఎస్టి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీని మీద పాజిటివ్ గా నెగటివ్ గా మిశ్రమ స్పందన దక్కుతున్న నేపధ్యంలో నిన్నటి తరం హాట్ స్టార్ షకీలా తనదైన స్టైల్ లో స్పందించింది. రెండు దశాబ్దాల క్రితం తన సినిమాలతో కుర్రకారుతో పాటు వయోభేదం లేకుండా అందరిని తన అందాలతో వెర్రెక్కించిన షకీలా ఒక యు ట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ వీడియో గురించి స్పష్టంగా మాట్లాడింది. వర్మ తీసింది తప్పు అనడం కరెక్ట్ కాదని, ఇష్టం లేనప్పుడు చూడకుండా ఉండాలి కాని ఇలాంటి వీడియోల వల్లే యువత, సమాజం మొత్తం పాడవుతోందని అనటం అర్థరహితమని మహిళా సంఘాల మీద మండి పడింది. అసలు వాళ్ళకు పని లేక ఇలాంటి నిరసనలు చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఒకవేళ వర్మ వచ్చి జిఎస్టి పార్ట్ 2 లో నటించమని తనను అడిగితే తప్పకుండా చేస్తానని కాకపోతే ఆయన సన్నబడమని అడుగుతారని అది జరగాలంటే ఓ రెండు మూడేళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పడం విశేషం. పైగా కనీసం 30 కిలోల బరువు తగ్గే దాకా అలాంటి సినిమాలు చేయలేమని చెప్పడం ఇక్కడ అసలు ట్విస్ట్. అంతా బాగుంది కాని మియా మల్కొవాను చూసిన కళ్ళతో ఆంటీ ఏజ్ దాటేసిన షకీలాను చూడటం అంటే కష్టమే. ఇది జరిగే పని కాదు కాని షకీలా ధైర్యానికి మాత్రం మెచ్చుకోవచ్చు. ఈ వయసులో కూడా వర్మ అడిగితే జిఎస్టి లాంటి వీడియోలో నగ్నంగా నటించేస్తాను అని బోల్డ్ గా చెప్పడం తనకే చెల్లింది. షకీలా తన 250వ సినిమా శీలవతీ పేరుతో తెలుగులోనే చేస్తున్న సంగతి తెలిసిందే. చూస్తుంటే షకీలా ఇంత లేటు వయసులో కూడా నో కాంప్రోమైజ్ అంటోంది అంటే ఆ సినిమా నుంచి హాట్ సీన్స్ ఆశించడంలో తప్పు లేదనిపిస్తోంది.

Full View
Tags:    

Similar News