ఇష్టం ఉన్నా.. డైరెక్ట్ గా చెప్ప‌ట్లేద‌ట‌

Update: 2017-12-03 17:30 GMT
ముద్దుగా బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మ‌లు సిల్వ‌ర్ స్క్రీన్ మీద రాణించ‌టం క‌ష్ట‌మ‌ని పెద‌వి విరిచేస్తుంటారు. అయితే.. అలాంటివ‌న్నీ ఉత్త‌మాట‌లుగా తేల్చేసే భామ‌లు అప్పుడ‌ప్పుడు వ‌స్తుంటారు. అలాంటి కోవ‌లోకే చెందుతుంది అర్జున్ రెడ్డి ఫేం షాలిని. తొలి సినిమాతోనే ఇర‌గొట్టేసిన ఈ బొద్దుగుమ్ము ఇప్పుడు మ‌రింత స్లిమ్ గా మారింది.

సినిమాలో క‌థ‌కు త‌గ్గ‌ట్లుగానే బ‌రువు పెరిగానే కానీ తానేమీ బొద్దుగుమ్మ‌ను కాన‌ని..కావాలంటే ఇప్పుడు చూడండంటూ చెబుతోంది. తెలుగులో 100% ల‌వ్ మూవీ త‌మిళ రీమేక్ లో న‌టిస్తున్న షాలిని.. ఇప్పుడు తాను బాగా స‌న్న‌ప‌డిపోవ‌టాన్ని చూడాల‌ని చెబుతున్నారు. స్క్రీన్ మీద స‌రే.. ఆఫ్ స్క్రీన్ ల‌వ్ మ్యాట‌రేంట‌న్న కొంటె ప్ర‌శ్న‌కు గ‌డుసుగా బదులిచ్చింది.

అలాంటి అనుభ‌వం లేద‌ని.. ఏ ఒక్క‌రూ ఐల‌వ్ యు అన్న‌ది చెప్ప‌లేద‌ని.. అందుకే ప్రేమంటే ఎలా ఉంటుందో ఆన్ స్క్రీన్ లో తెలుసుకుంటున్న‌ట్లు చెప్పింది. ఇంత అంద‌మైన అమ్మాయికి ఒక్క‌రు కూడా ప్ర‌పోజ్ చేయ‌లేదా? అంటే.. కొత్త విష‌యాన్ని చెప్పింది. తాను కాస్త తేడా అని.. ఏదైనా విష‌యాన్ని ప‌ట్టుకుంటే అందులోనే మునిగిపోతాన‌ని.. ప‌క్క‌న‌వేమీ ప‌ట్టించుకోన‌ని.. స్కూల్ డేస్ లో పుస్త‌కాల‌తో మునిగిపోయాన‌ని చెప్పింది. అందుకే త‌న‌ను మ‌ర‌బొమ్మ టైపు అమ్మాయిన‌ని అబ్బాయిలు అనుకునేవార‌ని చెప్పింది.

అప్ప‌టికి త‌న‌ను ఇష్ట‌ప‌డిన అబ్బాయిలు ఉన్నా.. ఎవ‌రూ నేరుగా చెప్పేవారు కాద‌ని.. ఫ్రెండ్స్ తో చెప్పేవార‌ని.. అలా చెబితే ఏం లాభ‌మంటూ కొంటెగా చెప్పేసింది. మొత్తానికి మాట‌ల్లో గ‌డుసు పిండ‌మే సుమి.
Tags:    

Similar News