సినిమాల్లో హీరోయిన్ గా కుదురుకోవడం అంత తేలికైన విషయమేమీ కాదు. ఆసక్తి.. ప్రతిభ.. ఇలాంటివి ఎన్నున్నా అసలంటూ అవకాశం రావాలి. వీటితో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. వీటిలో ఏదో ఒక్కటి మిస్ అయి.. సినిమా ఫీల్డ్ లో గుర్తింపు కోసం పడిగాపులు పడే జనాభా చాలామందే ఉంటారు. అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండకి హీరోయిన్ గా నటించిన షాలిని పేరు.. ఇప్పుడు మార్మోగిపోతోంది. ఇక్కడి వరకూ వచ్చేందుకు ఈ భామ పడ్డ కష్టాల చిట్టా వింటే.. ఎంత కష్టం వచ్చిందో అనిపించక మానదు.
తనకు ఇష్టం లేకపోయినా తండ్రి ఒత్తిడి మేరకు గ్రాడ్యుయేషన్ లో సైన్స్ తీసుకుందట షాలిని. అయితే.. ఆ తర్వాత గ్లామర్ ఫీల్డ్ లోకి వచ్చేందుకు తండ్రిని ఒప్పించడం చాలా కష్టమైందట. అర్జున్ రెడ్డి సినిమా కథను కూడా.. మొదట ఆమె తండ్రికే వినిపించాడట దర్శకుడు సందీప్. ఆ తర్వాత ఓ వారం కష్టపడితే కానీ.. ప్రాజెక్టుకు సైన్ చేసేందుకు తండ్రిని ఒప్పించలేకపోయిందట. అక్కడిన నుంచి ఐదారు నెలలు గడిచిపోయినా సినిమా షూటింగ్ మాత్రం ప్రారంభం కాకపోవడంతో ముంబై వెళ్లేందుకు ఫిక్స్ అయ్యానని చెప్పింది షాలిని.
ఇందుకు కూడా తండ్రి ఒప్పుకోలేదట. అయితే.. ఓ వారంలో వచ్చేస్తానని చెప్పి ముంబై వెళ్లిన షాలిని.. అక్కడ తాను ఎక్కడుందో కూడా తండ్రికి చెప్పలేదట. నాన్న ఫోన్ చేసి తను తప్పిపోయినట్లు పోలీస్ కేసు పెడతానంటే.. "నన్ను మా నాన్న టార్చర్ చేస్తున్నాడంటూ నేను కూడా కేసు పెడతాను. నాకిప్పుడు 22 ఏళ్లు" అంటూ బెదిరిందించిదట షాలిని. అలాగని తాను ఎవరినీ హర్ట్ చేయాలని అనుకోలేదని.. ముఖ్యంగా తండ్రి తనను ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుసని.. కానీ తన కాళ్లపై తాను నిలబడాలనే తపన కారణంగానే.. ఇంతకు తెగించానని చెబుతోంది షాలిని.