నిఖిల్ పక్కన హీరోయిన్ మారింది

Update: 2018-02-24 05:00 GMT
హీరో నిఖిల్ కెరీర్ లా చాలాకాలం గ్యాప్ తరవాత రీమేక్ సినిమా చేశాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన కిరాక్ పార్టీని తెలుగులో వెర్షన్ లో నటించాడు. ఈ సినిమా రిలీజుకు సిద్ధమవవుతోంది. కిరాక్ పార్టీ తరవాత కూడా నిఖిల్ మళ్లీ రీమేక్ సినిమాయే చేయబోతున్నాడు. తమిళంలో హిట్టయిన కణితన్ మూవీలో నటిస్తున్నాడు.

కణితన్ రీమేక్ లో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆ సినిమా టీం చాలారోజులుగా కుస్తీ పడుతోంది. హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మళయాళ కుట్టి కళ్యాణి ప్రియదర్శన్ ను హీరోయిన్ గా చేస్తోందని మాట వినిపించింది. ఆమె పేరు అఫీషియల్ గా అనౌన్స్ చేయడమే ఇక మిగిలింది అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా కొత్త భామ తెరపైకొచ్చింది. అర్జున్ రెడ్డితో అందరి గుండెల్ని కొల్లగొట్టిన బ్యూటీ షాలినీ పాండే ను ఈ ఛాన్స్ వరించిందనేది లేటెస్ట్ న్యూస్. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న టి.ఎన్.సంతోష్ ఇప్పటికే షాలినీ పాండేను కలిసి సబ్జెక్టు వినిపించాడని తెలుస్తోంది. షాలినీ రెస్పాండ్ అయిన తీరు పట్ల డైరెక్టర్ సంతోష్ హ్యాపీగా ఉన్నాడని.. కాబట్టి ఆమెనే ఫైనలైజ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందని మూవీ టీంలోని ఒకరు చెప్పుకొచ్చారు.

అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన షాలినీపాండే తరవాత సినిమా తమిళంలో చేస్తోంది. తెలుగులో సూపర్ హిట్లయిన 100 % లవ్ తమిళ వెర్షన్ లో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పుడు తమిళంలో హిట్టయిన కణితన్ తెలుగు వెర్షన్ లో నటిస్తోంది.


Tags:    

Similar News