టాప్ హీరో హీరోయిన్లు.. దర్శకుల వ్యక్తిగత విషయాలపై జనాలకు చాలా ఆసక్తి ఉంటుంది. కానీ ఈ విషయాల్ని అందరూ పంచుకోరు. మామూలుగానే మీడియాతో చాలా తక్కువగా మాట్లాడే స్టార్ డైరెక్టర్ శంకర్.. తన కుటుంబం గురించి ఏదైనా చెప్పడం చాలా చాలా అరుదు. ఐతే ‘2.0’ ప్రమోషన్లలో భాగంగా తన పిల్లలు.. వాళ్లతో తన అనుబంధం.. వాళ్లతో జరిగే సినిమా చర్చల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
తన జీవితం సినిమా చుట్టూనే తిరుగుతుంటుందని.. ఇంట్లో కంటే ఆఫీస్ లోనే తాను ఎక్కువగా గడుపుతుంటానని చెప్పిన శంకర్.. రోజులో కుటుంబానికి కేటాయించే ఒకటి రెండు గంటలైనా క్వాలిటీ టైం గడపాలని అనుకుంటానని అన్నాడు. తన సినిమాల గురించి.. తన పని గురించి తెలుసుకోవాలని తన పిల్లలు తహతహలాడిపోతుంటారని.. కానీ వాళ్లకు అన్ని విషయాలూ చెప్పనని అన్నాడు. ముఖ్యంగా తన సినిమాల కథ తెలుసుకోవాలని వాళ్లు చాలా ప్రయత్నిస్తారన్నారు.
కానీ తాను తన హీరోలకే పూర్తి కథ చెప్పనని.. అలాంటిది పిల్లలకు ఎలా చెబుతానని అన్నాడు శంకర్. కానీ ఇంట్లో తాను ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నా ఆసక్తిగా వింటుంటారని.. తన ఫోన్లో సినిమాకు సంబంధించిన స్టిల్స్ కూడా చూస్తారని.. కొన్ని మెసేజ్ లు కూడా పరిశీలిస్తారని... ఇలా అన్ని విషయాలూ క్రోఢీకరించుకుని కథ రాసుకుంటారని.. ఆరు నెలల తర్వాత తన దగ్గరికొచ్చి ఇదేగా నీ స్టోరీ అని చూపిస్తారని.. కానీ నేను కాదని నవ్వేస్తానని శంకర్ చెప్పాడు.