ఇండియన్​ 2 నుంచి శంకర్​ డ్రాప్.. నిజమేనా?

Update: 2020-11-12 11:50 GMT
శంకర్​ దక్షిణాదిన అగ్ర దర్శకుల్లో ఒకరు. ఇక కమల్​ హాసన్ లోకనాయకుడు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్​ ఉన్నారు. కమల్ నటన గురించి ఇక చెప్పాల్సిన పనిలేదు. వీళ్లిద్దరి కాంబినేషన్​లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ బంపర్​ హిట్​ను అందుకుంది. అప్పట్లో రికార్డ్ లను తిరగరాసింది. ఈ చిత్రంతో దర్శకుడు శంకర్, హీరో కమల్​కు లెక్క లేనన్ని ఎన్నో ప్రశంసలు, అవార్డ్ లు దక్కాయి.కొన్నేళ్ల పాటు ఆ సినిమా ప్రభావం భారతీయ చలనచిత్ర రంగంమీద అలా ఉండి పోయింది. ఆ తర్వాత కూడా అదే ఫార్ములాతో అనేక సినిమాలు తెరకెక్కి విజయం సాధించాయి. అయితే చాలా ఏళ్ల అనంతరం ఆ సినిమాకు సీక్వెల్​ ప్లాన్​ దర్శకుడు శంకర్ ప్లాన్ చేశారు.

ఎందుకో ఆ మూవీ షూటింగ్‌ ప్రారంభించిన నాటి నుంచి అన్ని ఆటంకాలే ఎదురవుతున్నాయి. షూటింగ్ జరిగే సమయంలో ప్రమాదం వాటిల్లి ఇద్దరు కార్మికులు కన్నుమూశారు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌, శంకర్ మధ్య ప్రారంభంలోనే విభేదాలు తలెత్తాయి. కరోనా తర్వాత ఈ సినిమా పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ సినిమా షూటింగ్ పున:ప్రారంభం గురించి నిర్మాణ సంస్థ పట్టించుకోవడం మానేసిందట. దీంతో శంకర్ వేరే ప్రాజెక్టు ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం.

దీని కంటే ముందు తన కూతురు పెళ్లి పనులపై శంకర్ దృష్టి పెట్టినట్టు తాజా సమాచారం. అదితి శంకర్ పెళ్లి పనులతో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టును శంకర్​ వదులుకోకపోవచ్చని.. కూతురు పెళ్లి అయ్యాక తప్పకుండా షూటింగ్​ను ప్రారంభిస్తారని కొందరు అంటున్నారు. ఈ సినిమాపై ఇప్పటివరకు కమల్​హాసన్​ కూడా స్పందించలేదు. మరోవైపు ప్రస్తుతం కమల్​హాసన్​ రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఆయన అభిమానులు కూడా రాజకీయకార్యకలాపాల్లో మునిగిపోయారు. బహుశా ఈ ఎన్నికల అనంతరం కమల్​హాసన్​ షూటింగ్​ గురించి ఆలోచిస్తారేమో చూడాలి.
Tags:    

Similar News