పక్షి కారణంగా చిట్టి లేటు!

Update: 2018-10-03 10:29 GMT
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న '2.0' ఎన్నో వాయిదాల తర్వాత ఫైనల్ గా నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గత ఏడాదిలోనే రిలీజ్ కావలిసి ఉన్నప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలు అవుట్ పుట్ సరిగా ఇవ్వక పోవడంతో లైకా ప్రొడక్షన్స్ వారు వేరే కంపెనీ ఆ కాంట్రాక్ట్ ఇవ్వవలిసి వచ్చిందని దీంతోనే సినిమా రిలీజ్ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి.

కానీ అసలేం జరిగిందో ఇంతవరకూ '2.0' టీమ్ కు సంబంధించిన వారు ఎవ్వరూ మాట్లాడలేదు. తాజాగా డైరెక్టర్ శంకర్ ఒక ఇంటర్వ్యూ లో వాయిదాలకు కారణం వెల్లడించాడు. టీజర్లో ఒక పక్షి భయంకరంగా కనిపిస్తుందిగా..  ఆ పక్షి వల్లే సినిమా రిలీజ్ వాయిదా పడిందట.  సినిమా బడ్జెట్ లో మూడో వంతు వీఎఫ్ ఎక్స్ కు ఖర్చుపెట్టారట.  వీఎఫ్ ఎక్స్ కు ఖర్చు పెట్టిన మొత్తంలో అధిక భాగం ఆ పక్షి కోసం ఖర్చయిందట.   మొదట్లో తన విజువలైజేషన్ కు తగ్గట్టు అవుట్ పుట్ రాలేదట. పైగా సమయానికి వాళ్ళు  అవుట్ పుట్ ఇవ్వక పోవడం... మాటి మాటికి డెడ్ లైన్స్ మార్చడంతో మార్వెల్ స్టూడియోస్ సినిమాలకు వీఎఫ్ ఎక్స్ వర్క్ చేసే సంస్థకు అప్పగించారట.

భారీ స్థాయిలో వీఫెక్స్ వర్క్ అవసరం ఉండే సినిమాలకు వాయిదాలు కామనే. ఇక బాహుబలి విషయంలో కూడా వీఎఫ్ ఎక్స్ వల్లే ముందు ప్లాన్ చేసిన దానికంటే ఎక్కువ సమయం పట్టింది.  ఏదేమైనా '2.0' సినిమాలో మంచి కంటెంట్ ఉంటే.. శంకర్ పడిన శ్రమకు.. వీఎఫ్ ఎక్స్ కోసం వెచ్చించిన సమయానికి ఫలితం ఉంటుంది.  నిర్మాతలతో ఇంత భారీ బడ్జెట్ పెట్టించినందుకు శంకర్ స్ట్రాంగ్ కంటెంట్ తో నే వస్తాడని ఆశిద్దాం.
Tags:    

Similar News