యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ విడుదలకు సిద్ధం అవుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా మరోసారి అధికారికంగా ప్రకటించారు.
ఆదిపురుష్ పోస్టర్ మరియు టీజర్ సినిమా స్థాయిని పెంచింది అనడంలో సందేహం లేదు. టీజర్ లో ప్రభాస్ యొక్క విజువల్స్ మరియు ఇతర సన్నివేశాలు మరియు షాట్స్ అద్భుతం అన్నట్లుగా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇక టీజర్ లో ప్రభాస్ డైలాగ్ కి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. హిందీలో ప్రభాస్ కి శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పాడు. టీజర్ లో ఆయనదే వాయిస్ వినిపిస్తుంది. బాహుబలి సినిమా కోసం శరద్ కేల్కర్ తో ప్రభాస్ పాత్ర కు డబ్బింగ్ చెప్పించారు. అందులో చక్కగా సెట్ అయ్యింది.
సాహో మరియు రాధేశ్యామ్ సినిమాల యొక్క హిందీ వర్షన్ లకు ప్రయోగం చేసి విఫలం అయ్యారు. హిందీ డబ్బింగ్ ప్రభాస్ కి అస్సలు సెట్ అవ్వలేదు అంటూ రాధేశ్యామ్ సమయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకే మళ్లీ సాహసం చేయడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో ఆదిపురుష్ కు బాహుబలి సినిమా కి డబ్బింగ్ చెప్పిన శరద్ కేల్కర్ తోనే డబ్బింగ్ చెప్పించడం జరిగిందట.
శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పడం సెంటిమెంట్ గా కూడా కలిసి వచ్చి బాహుబలి రేంజ్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ బాడీలాంగ్వేజ్ కి హిందీలో శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్తే సరిగ్గా సెట్ అవుతుందని.. ఆదిపురుష్ కి శరద్ కేల్కర్ డబ్బింగ్ చాలా మంచి నిర్ణయం అన్నట్లుగా సినీ రివ్యూవర్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.