విలన్ కి మళ్లీ ఛాన్స్ ఇచ్చిన పవన్

Update: 2016-06-29 07:57 GMT
సర్దార్ గబ్బర్ సింగ్ మూవీతో పవర్ స్టార్ చాలా రికార్డులనే నెలకొల్పాడు. యూఎస్ లో ప్రీమియర్లతో కలెక్షన్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ తో పాటు.. డిజాస్టర్ మూవీని 50 కోట్ల రేంజ్ దాటించిన మొదటి స్టార్ గా సంచలనం సృష్టించాడు. అయితే.. సర్దార్ కు సంబంధించి పవన్ అన్నీ దగ్గరుండి చూసుకున్న విషయం తెలిసిందే. ఇందులో విలన్ పాత్రకు ఎంపిక కూడా.

మరాఠీ - హిందీ సినిమాల్లో కనిపించే శరద్ కేల్కర్ ను తనే ఏరికోరి ఎంపిక చేసుకుని.. సర్దార్ గబ్బర్ సింగ్ లో నటింపచేశాడు పవన్ కళ్యాణ్. కానీ ఆ చిత్రం నిరాశ పరచడంతో.. శరద్ కు మళ్లీ టాలీవుడ్ లో అవకాశం రాలేదు. అందగాడు.. పైగా ట్యాలెంట్ ఉన్నోడు అయిన ఈ నటుడికి మరో అవకాశం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించాడు. ప్రస్తుతం డాలీ డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీలో కూడా శరద్ కేల్కర్ కి కీలక పాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా డబ్బింగ్ పై ఆధారపడకుండా.. ఈసారి తన రోల్ కి తనే డబ్బింగ్ చెప్పబోతున్నాడట ఈ విలన్.

పవన్ తో రెండో సినిమాలో కూడా ఆఫర్ రావడంతో శరద్ కేల్కర్ ఫుల్లు హ్యాపీగా ఉన్నాడు. మరోవైపు దర్శకుడు డాలీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పవన్- వెంకటేష్ తో కలిసి గోపాలా గోపాలా చిత్రాన్ని తీసిన డాలీకి.. త్వరగానే మళ్లీ పవన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే.. హీరోయిన్ శృతి హాసన్ కూడా పవన్ తో రెండోసారి జత కట్టనుండడం.
Tags:    

Similar News