కింగ్ ఖాన్ షారూక్ ఉత్థానపతనాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇంతింతై అన్న చందంగా సూపర్ స్టార్ గా ఎదిగిన షారూక్ ఆ స్థాయిని అందుకునేందుకు దశాబ్ధాల పాటు ఎంతో హార్డ్ వర్క్ చేశారు. రెడ్ చిల్లీస్ పేరుతో భారీ వ్యాపార సామ్రాజ్యాన్నే విస్తరించారు.
అయితే ఆయన కెరీర్ నటుడిగా జీరోయేనా? అంటే.. అవుననే రెండేళ్లుగా సన్నివేశం చెబుతోంది. షారూక్ అదిరిపోయే బ్లాక్ బస్టర్ కొట్టి కంబ్యాక్ అవ్వాలని ఎంతగా తపిస్తున్నా ఆ ఒక్కటీ సాధ్యం కావడం లేదు. తన చివరి విడుదల ‘జీరో’ పరాజయం తరువాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇంతవరకూ వేరొక సినిమాకి సంతకం ఏయలేదు. ఇప్పటికీ మేకప్ వేసుకోనేలేదు.`ది జోయా ఫాక్టర్` సినిమాకు కథకుడిగా వాయిస్ ఇవ్వడం మినహా దాదాపు రెండున్నర సంవత్సరాలు పైగా అంటే 30 నెలలు అతను షూటింగ్ లకు దూరంగా ఉండిపోవడం విస్మయపరుస్తోంది. ది లయన్ కింగ్ కి వాయిస్ ఇవ్వడం మినహా వేరే దేనిని శ్రద్ధాగా తీసుకోలేదు.
అయితే యష్ రాజ్ ఫిలింస్ సినిమా అని.. అలాగే తమిళ దర్శకుడు అట్లీతో సినిమా అని ప్రచారం సాగింది తప్ప ఏదీ కన్ఫామ్ చేయకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ షారూక్ మైండ్ లో ఏం ఉంది? ఆయన ఏ సినిమా చేస్తున్నారు? అన్నదానిపై సరైన క్లారిటీ లేదు. తదుపరి ‘పఠాన్’ షూటింగ్ లో నవంబర్ చివరి నాటికి చేరే వీలుందని సమాచారం.
అయితే షారూక్ తన వారసుడిని బరిలో దించే సమయమాసన్నమైందన్న విశ్లేషణ మరోవైపు సాగుతోంది. ఇప్పటికే వారసుడు ఆర్యన్ ఖాన్ హీరోలా మెచ్యూర్డ్ ఏజ్ లోనే ఉన్నాడు. ఇటీవల షారూఖ్ ఖాన్ కుటుంబం దుబాయ్ లో క్రికెట్ మ్యాచ్ లను చూడటం కొనసాగిస్తున్న సమయంలో అతడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. షారూఖ్ కోల్ కతా నైట్ రైడర్స్ యజమాని గా కొనసాగుతున్న సంగతి విధితమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సందర్భంగా తన జట్టు ఆటతీరును ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు ఖాన్ ద్వయం. సోమవారం కూడా షారూక్ తన కుమారుడు ఆర్యన్ తో కోల్‌కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కనిపించాడు. షార్జా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ఆద్యంతం వీక్షించారు ఆ ఇద్దరూ. ఇక ఈ సన్నివేశం చూస్తున్నంత సేపూ ఇక బాద్ షా వారసుడిని బరిలో దించేయడమే కరెక్ట్ అంటూ అభిమానుల్లో ఊహాగానాలు సాగాయి.