తొంభై ఆరుకు దారి దొరికింది

Update: 2019-04-03 09:30 GMT
గత ఏడాది విడుదలై తమిళ్ లో క్లాసిక్ గా మిగిలిపోవడంతో పాటు కమర్షియల్ గా సైతం ఘన విజయం సొంతం చేసుకున్న 96 తెలుగు రీమేక్ కు రంగం సిద్ధమవుతోంది. ఉగాది పండగ సందర్భంగా ఈ వారంలోనే ఓపెనింగ్ చేయబోతున్నట్టు తాజా అప్ డేట్. నిజానికి దీని హక్కులను నిర్మాత దిల్ రాజు ఎప్పుడో కొన్నారు. ప్రీమియర్ షోలకు నానిని బన్నీని వెంటబెట్టుకుని మరీ చూపించారు. కాకపోతే కార్యరూపం దాల్చడానికి ఇంత టైం పట్టింది.

శర్వానంద్ సమంతాలు జోడిగా నటిస్తున్న ఈ మూవీ కన్నడ వెర్షన్ ఇప్పటికే వేరే దర్శకుడితో పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడ ఒరిజినల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ కావడంతో స్క్రిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చేసి చివరికి ఓ కొలిక్కి తెచ్చారు. సంగీతం కూడా గోవింద్ వసంతే అందించనున్నారు. దీనికి జాను అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ఇన్ సైడ్ టాక్

దిల్ రాజు బ్యానర్ లో ఇది మొదటి రీమేక్ గా ఇప్పటికే ప్రత్యేకతను సంతరించుకుంది. శర్వానంద్ సమంతాల ఫస్ట్ కాంబో కావడంతో ఆ రకంగా కూడా అంచనాలు ఉన్నాయి. బడ్జెట్ పరంగా రిస్క్ లేని సబ్జెక్టు కావడంతో చాలా తక్కువ టైంలోనే ఫినిష్ చేయబోతున్నారు. దసరా లోపే రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతున్నట్టు సమాచారం  

 ఎలాగూ విదేశాలకు వెళ్లే అవసరం లేకపోవడంతో ఇక్కడే పూర్తి చేయొచ్చు. మొత్తానికి ఆలస్యం అవుతోందే అనుకున్న 96 రీమేక్ ఫైనల్ గా సెట్స్ లో అడుగు పెట్టబోతోంది. మిగిలిన తారాగణం తదితర వివరాలు పూజ రోజునే ప్రకటించనున్నారు
    

Tags:    

Similar News