వర్సటైల్ హీరో శర్వానంద్ కి ఈ మధ్య ఏమాత్రం కలిసి రావడం లేదు. విభిన్నమైన సినిమా ఎంచుకున్నా వరుసగా నాలుగు ప్లాపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వంలో చేసిన 'పడి పడి లేచే మనసు' ఫీల్ గుడ్ లవ్ స్టొరీ అనిపించుకున్నప్పటికి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత సుధీర్ వర్మ తో చేసిన 'రణ రంగం' పరాజయం చవిచూసింది. అలానే తమిళ్ లో సూపర్ హిట్ అయిన 'జాను' ని రీమేక్ చేయగా.. ఇక్కడ ప్లాప్ గా మిగిలిపోయింది. ఈ క్రమంలో ఎన్నో అంచనాలతో వచ్చిన 'శ్రీకారం' సినిమా కూడా శర్వా కు నిరాశనే మిగిల్చింది.
బి. కిషోర్ రెడ్డి అనే కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ 14 రీల్స్ ప్లస్ రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట 'శ్రీకారం' చిత్రాన్ని నిర్మించారు. నూతన వ్యవసాయ విధానానికి శ్రీకారం అంటూ సందేశాత్మక అంశాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్ళు సాధించలేకపోయింది. ఈ కంటెంట్ బేస్డ్ మూవీని మెగాస్టార్ చిరంజీవి - తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ లాంటి ప్రముఖులు కూడా మెచ్చుకున్నారు. అయినప్పటికీ ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని రిసీవ్ చేసుకోలేదు. దాదాపు 16 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన 'శ్రీకారం' ఫైనల్ రన్ పూర్తయ్యాక 9.6 కోట్లు మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే శర్వానంద్ మాత్రం ప్లాప్స్ వస్తున్నాయని డీలా పడకుండా ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో సినిమాలు చేస్తున్నాడు. 'Rx 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో బొమ్మరిల్లు సిద్దార్థ్ తో కలిసి 'మహాసముద్రం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. అలానే తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న బైలింగ్విల్ షూటింగ్ పూర్తి చేశాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా 'ఆడాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రాన్ని ఇటీవలే స్టార్ట్ చేశారు. ఇక ఏసియన్ వారితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడని తెలుస్తోంది. మరి ఈ సినిమాలతో మంచి విజయాలు అందుకుని శర్వా మళ్ళీ కెరీర్ ని గాడిలో పెట్టుకుంటాడేమో చూడాలి.