అప్పుడు కామెడీగా.. ఇప్పుడు సీరియస్ గా శర్వా పోలీస్‌

Update: 2021-04-14 12:30 GMT
యంగ్‌ హీరో శర్వానంద్‌ కెరీర్‌ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇటీవలే ఆయన శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్స్‌ విషయంలో తీవ్ర నిరాశను సినిమా మిగిల్చింది. అంతకు ముందు జాను మరియు రణరంగం సినిమాలు కూడా శర్వా ఖాతాలో ప్లాప్‌ లు గా పడ్డాయి. శర్వాకు వరుస ఫ్లాప్‌ లు పడ్డా కూడా ఆయన అభిమానులు మాత్రం ఖచ్చితంగా శర్వానంద్‌ మళ్లీ ఒక మంచి సినిమాతో వస్తాడనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. మంచి కథలను ఎంపిక చేసుకోవడంలో శర్వానంద్‌ ఎప్పుడు ముందు ఉంటాడు. కనుక ఆయనకు తప్పకుండా మంచి సక్సెస్‌ పడుతుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మహా సముద్రం.. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా చేస్తున్న శర్వానంద్‌ కొత్తగా ఒక పోలీస్‌ స్టోరీకి ఓకే చెప్పాడంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. శర్వానంద్‌ గతంలోనే పోలీస్ స్టోరీతో సినిమాను చేశాడు. 'రాధ' టైటిల్‌ తో వచ్చిన ఆ సినిమాలో శర్వానంద్‌ పోలీసుగా కనిపించి నవ్వించాడు. కామెడీ పోలీసుగా రాధలో నటించిన శర్వానంద్‌ తాజాగా కమిట్‌ అయిన పోలీస్‌ స్టోరీలో మాత్రం చాలా సీరియస్ గా పవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎన్నో పోలీస్‌ స్టోరీస్ వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. పోలీస్‌ స్టోరీలను కొత్తగా ఇంట్రెస్టింగ్ స్క్రీన్‌ ప్లేతో తీస్తే తప్పకుండా సినిమా సక్సెస్‌ అవుతుందని ఇప్పటికే వచ్చిన చాలా సినిమాలు నిరూపించాయి. కనుక శర్వానంద్‌ చేయబోతున్న ఈ సీరియస్‌ పోలీస్‌ రోల్‌ తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది చివర్లోనే శర్వా పోలీస్ యూనిఫార్మ్‌ వేసుకునే అవకాశం ఉందట.
Tags:    

Similar News