శర్వానంద్ నటించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా `ఒకే ఒక జీవితం` సెప్టెంబర్ 9 న సినిమా హాళ్లలోకి వచ్చింది. విడుదల రోజున కథానాయకుడు శర్వా తన కుటుంబంతో కలిసి ఓ థియేటర్ ని సందర్శించాడు. ఈ ఎమోషనల్ ఫ్యామ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. శర్వానంద్ తన తల్లితో కలిసి వేదిక పైకి వెళ్లి... థియేటర్ లో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా కలుసుకుని పలకరించడం చూశాం. శ్రీ కార్తీక్ సంభావిత దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్ తల్లీ కొడుకుల బంధం నేపథ్యంలో ఆసక్తికర డ్రామాతో సాగుతుంది.
పరిశ్రమలో పెద్దగా ఎదగాలని తహతహలాడే ఒక యువ ఔత్సాహిక సంగీతకారుడి(శర్వానంద్) జీవితాన్ని ప్రతిబింబించే చిత్రమిది. అయితే విధి వైపరీత్యం.. అతని తల్లి మరణంతో జీవితంపై ఉత్సాహాన్ని కోల్పోతాడు. ఆత్మవిశ్వాస లోపంతో కెరీర్లో ముందడుగు వేయలేకపోతుంటాడు.
అతడి ఇద్దరు స్నేహితులు (వెన్నెల కిషోర్.. ప్రియదర్శి) కూడా కొన్ని సమస్యలతో సతమతం అవుతుంటారు. వీరి జీవితాలు నిరాశాజనకంగా సాగుతున్న సమయంలో సైంటిస్ట్ పాల్ (నాజర్) వీరికి పరిచయం అవుతాడు. టైమ్ మెషీన్ ని అతడు పరిచయం చేయగా తన తల్లిని కలవాలని తపనతో వారి 20ఏళ్ల వెనకటి జీవితంలోకి వెళతారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే సినిమా. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన అరుదైన చిత్రమిది.
తాజాగా ఈ మూవీ విజయం నేపథ్యంలో థాంక్స్ మీట్ లో శర్వానంద్ చెప్పిన కొన్ని సంగతులు ఆశ్చర్యానికి గురి చేసాయి. ఈ సందర్భంగా శర్వానంద్ ఓకే ఒక జీవితం షూటింగ్ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లినట్లు వెల్లడించారు. ``ఒకే ఒక జీవితం షూటింగ్ సమయంలో నేను డిప్రెషన్ లోకి వెళ్లాను. అదే ఈ సినిమా ప్రభావం నాపై పడింది. నేను ఒక షెడ్యూల్ పూర్తి చేసి కౌన్సెలింగ్ కోసం అమెరికా వెళ్లాను`` అని శర్వానంద్ చెప్పాడు. అయితే అలాంటి సినిమాలు చేయవద్దని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఒకే ఒక జీవితం నా బెస్ట్ ఫిల్మ్.. అని అన్నారు. ప్రతి షోకి ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోందని శర్వానంద్ అన్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ -దర్శి తదితరుల పాత్రలు ఎంతో మెప్పించాయని నిర్మాణ సంస్థ రాజీలేకుండా సహకరించిందని కూడా శర్వా ప్రశంసించారు.
శర్వానంద్- రీతూ వర్మ- అమల అక్కినేని- వెన్నెల కిషోర్- ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ SR ప్రకాష్ బాబు - SR ప్రభు నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ కాగా జేక్స్ బిజోయ్ స్వరాలు అందించారు. తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.