శర్వానంద్ స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. శతమానం భవతి- మహానుభావుడు చిత్రాల సక్సెస్ అతడి కెరీర్ కి బిగ్ బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలకు కమిటయ్యాడు. ప్రతిదీ ప్లాన్ చేసుకుని చేయను అని చెప్పిన శర్వానంద్ ఒకేసారి రెండు మూడు సినిమాల్లో నటిస్తూ వేడి పెంచాడు. అయితే `పడి పడి లేచే మనసు` యావరేజ్ చిత్రంగా నిలిచింది. తదుపరి శర్వా నటించే సినిమా సంగతేంటి? అన్నది పరిశీలిస్తే ఆసక్తికర సంగతి తెలిసింది.
శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు. శర్వాని కొత్తగా ఆవిష్కరించేందుకు సుధీర్ వర్మ చాలానే తపిస్తున్నాడట. ఒక మాఫియా డాన్ గానూ చూపిస్తున్నాడన్న ప్రచారం సాగుతోంది. అయితే కథకు తగ్గ టైటిల్ దొరికిందా లేదా అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. దళపతి అనే టైటిల్ ని టీమ్ కావాలనుకుంది. కానీ ఆ టైటిల్ ని తెలుగు ఫిలింఛాంబర్ లో వేరొక నిర్మాత రిజిస్టర్ చేయించడం చిక్కులు తెచ్చిందట. ఆ టైటిల్ ని ఇచ్చేందుకు వాళ్లు నిరాకరించారని తెలుస్తోంది. ఎలానూ టైటిల్ తమది కాదని తేలిపోయింది కాబట్టి శర్వా దళపతి అని కానీ శర్వానంద్ దళపతి అని కానీ పెట్టుకునే వీలుంది.. కానీ వివాదాల జోలికి వెళ్లకూడదని టీమ్ నిర్ణయించుందన్న ముచ్చటా సాగుతోంది.
ఇకపోతే ఈ టైటిల్ కుదరకపోతే వేరొక సూటబుల్ టైటిల్ కావాలని చిత్రబృందం ఆలోచిస్తోందని తెలుస్తోంది. `నాయకుడు` అనే వేరొక టైటిల్ పరిశీలిస్తున్నా అంత పెద్ద స్పాన్ ఉన్న టైటిల్ వల్ల జనంలో అంచనాలు పీక్స్ కి చేరితే మరో రకం తంటా అని తటపటాయిస్తున్నారట. అన్ని సందహాలకు తొందర్లోనే క్లారిటీ రానుందని, కొత్త సంవత్సరం వేళ ఈ టైటిల్ ని లాంచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మార్చి చివరిలో లేదా ఏప్రిల్ లో ఈ చిత్రం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.