శర్వానంద్ సాయి పల్లవి మొదటిసారి జంటగా నటిస్తున్న పడి పడి లేచే మనసు షూటింగ్ కు చిన్న బ్రేకిచ్చారనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మొన్నటిదాకా ఫుల్ స్వింగ్ లో ఉన్న ఈ మూవీకి ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందనే దాని గురించి రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ మధ్యే వచ్చిన సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ తేజ్ ఐ లవ్ యు కథలో ఓ ప్రమాదం వల్ల హీరోయిన్ కు మెమరీ లాస్ కావడం అనే పాయింట్ పడి పడి లేచే మనసులో కూడా ఉందట. కాకపోతే అది హీరో కోణంలో ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అందుకే పోలికలు రాకుండా ఉండేందుకు దర్శకుడు హను రాఘవపూడి స్క్రిప్ట్ లో అవసరమైన మార్పులు చేర్పులు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పుడిచ్చిన గ్యాప్ కూడా అందుకేనని అంటున్నారు. ఇది నిజమో కాదో కానీ ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది. చాలా రోజుల నుంచే దీని తాలూకు అప్ డేట్స్ రావడం ఆగిపోయాయి. మొన్నామధ్య ఓ స్టిల్ విడుదల చేయటం తప్ప ఇంకే సందడి లేదు.
కొత్త తరహా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోందని ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. హను రాఘవపూడికి ఇది హిట్ కావడం చాలా అవసరం. గత ఏడాది నితిన్ తో భారీ బడ్జెట్ తో చేసిన లై డిజాస్టర్ కావడంతో పాటు కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగలడం అతన్ని ఇబ్బంది పెట్టింది. అందుకే ఈసారి పడిపడి లేచే మనసు విషయంలో అలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయినా కూడా తేజ్ ఐ లవ్ యుతో స్టోరీ పాయింట్ విషయంలో సారూప్యత రావడంతో కొన్ని మార్పులు చేసి దాని తర్వాత షూటింగ్ తిరిగి మొదలుపెట్టాలని ఆలోచన ఉన్నట్టుగా వినికిడి. అది ఎప్పుడు అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. పడిపడి లేచే మనసు అనే టైటిల్ కూడా మర్చిపోయి మళ్ళి మళ్ళి గుర్తుకు వస్తుంది అనే ఉద్దేశంతో పెట్టారనే వాదనకు జరుగుతున్న పరిణామం బలం చేకూరుస్తోంది. లెట్ వెయిట్ అండ్ సి.