శర్వానంద్ వరుసగా రాజా అనే టైటిల్ తో సినిమాలు చేసేస్తున్నాడు. రన్ రాజా రన్.. ఎక్స్ ప్రెస్ రాజా.. రాజాధిరాజా.. ఇలా వరుసగా అన్నీ రాజా అంటూనే టైటిల్స్ తో సహా వస్తుండగా.. ఈ సినిమాలో కూడా రాజా అనే పేరు పెడతానంటే.. వద్దు అని రాజు అని తన పేరు పెట్టించానంటున్నాడు శర్వానంద్. ఈ విషయాన్ని శతమానం భవతి ఆడియో రిలీజ్ ఫంక్షన్ వేదికగా చెప్పిన శర్వా.. నవ్వులు పూయించేశాడు.
తన ముందు ఆడిటోరియంలో ఉన్న వారినే కాదు.. వెనకాల ఉన్న టెక్నీషియన్స్ కూడా కలిపి 'నా ఇంత పెద్ద ఫ్యామిలీ' అని ప్రారంభించడంతోనే అందరినీ ఆకట్టుకున్నాడు శర్వా. 'ఈ మధ్య కాలంలో ఈ సినిమా నేను మిస్ కాకూడదు అని ఫీల్ అయ్యి తీసిన సినిమా. ప్రతీ ఫ్యామిలీలో మెంబర్.. పిల్లలతో చూసి ఇంటికెళతారు. పాటలు వింటంటే అందరూ ఇరవై ఏళ్ల క్రితం మా సొంతఊరు వెళ్లిన ఫీలింగ్ కలిగింది. 49 రోజుల్లో సినిమా ఫినిష్ చేశామంటే సమీర్ గారు అందించిన సహకారం మరిచిపోలేనిది' అన్నాడు శర్వానంద్.
'దిల్ రాజు సినిమా అని అందరూ అనుకుంటూ ఉంటారు. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఆయన ఊరికే దిల్ రాజు అవలేదు. ప్రతీ షాట్ విషయంలో ఆయన తీసుకునే విధానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈయన సినిమా కోసం తీసుకున్న జాగ్రత్తలు చూసి ఆయనపై రెస్పెక్ట్ పెరిగింది. ఆయన బ్యానర్ లో ఇంత మంచి సినిమా చేసినందకు సంతోషంగా ఉంది' అన్నాడు శర్వానంద్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/