శతమానం.. బియ్యపు గింజ.. శర్వానంద్

Update: 2017-01-11 05:00 GMT
శతమానం భవతి.. రెండేళ్ల ముందే తెరమీదికి వచ్చింది. రైటర్ టర్న్డ్ డైరెక్టర్ సతీశ్ వేగేశ్న చెప్పిన కథకు ఫిదా అయిపోయి ఈ చిత్రాన్ని తన బేనర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనుకున్నాడు రాజు. ముందు సాయిధరమ్‌ ను ఈ చిత్రానికి హీరోగా అనుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అతనీ సినిమా చేయలేకపోయాడు. మధ్యలో రాజ్ తరుణ్ పేరు వినిపించింది. తర్వాత అతనూ సైడైపోయాడు. చివరికి శర్వానంద్ హీరోగా సినిమా మొదలైంది. శరవేగంగా పూర్తయింది. సంక్రాంతి విడుదలకు సిద్ధమైపోయింది. ఐతే తానేదో అదృష్టం చేసుకున్నాను కాబట్టే ‘శతమానం భవతి’ లాంటి సినిమా చేయగలిగానని అంటున్నాడు శర్వానంద్.

లేకుంటే ఎవరో చేయాల్సిన ఈ సినిమా తన చేతికి రావడం ఏమిటన్నాడు శర్వా. ‘శతమానం భవతి’ యూనిట్ సభ్యులతో కలిసి ప్రివ్యూ చూసిన అనంతరం శర్వా చాలా ఎగ్జైట్ అయిపోతూ మాట్లాడాడు. ‘‘శతమానం భవతి ఎక్కడెక్కడికో వెళ్లి నా దగ్గరికి వచ్చింది. ప్రతి గియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అంటారు. అలాగే ఈ సినిమా మీద నా పేరు రాసి పెట్టినట్లుంది. అందుకే ఈ సినిమాను నేనే చేశాను. ఇలాంటి సినిమాలో నటించడం నా అదృష్టం. ఇలాంటి సినిమా ఇచ్చినందుకు రాజు అన్నకు రుణపడి ఉంటాను. సినిమా చూసినప్పటి నుంచి నాకు మాటలు లేవు. అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. నా జీవితాంతం ఈ సినిమాను గుర్తుపెట్టుకుంటాను. అంత గొప్ప సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులన్నీ నాకు.. మా యూనిట్ సభ్యులకు సంక్రాంతే. ఇప్పుడు పండక్కి రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది’’ అని శర్వా అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News