ఈ రోజుతో ''బొమ్మరిల్లు'' సినిమా రిలీజై 10 సంవత్సరాలు కావొస్తోందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే ఈ 10 సంవత్సరాల సెలబ్రేషన్స్ ను కొత్త స్థాయికి తీసుకెళ్ళడానికి ఇప్పుడు దిల్ రాజు ఒక కొత్త ట్రీట్ అందిస్తున్నట్లు ప్రకటించారు. అదే ''శతమానం భవతి''.
అప్పట్లో ఒక తండ్రిని ఒక కొడుక్కి మరింత దగ్గర చేయడం అనే కథను బేస్ గా తీసుకుని ''బొమ్మరిల్లు'' తీశారు. ఇప్పుడు ఒక తాతయ్యను తన మనవడికి దగ్గరగా చేయడం అనే బేస్ పాయింట్ తో.. ఒక తాత-మనవడు కైండాఫ్ కథతో.. రైటర్ సతీష్ వేగేశ్న డైరక్షన్లో ఒక సినిమాను రూపొందిస్తున్నారట. ఈ సినిమాతో తాత-మనవడిగా ప్రకాష్ రాజ్ అండ్ శర్వానంద్ నటిస్తున్నారు. ఇకపోతే హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తళుక్కుమంటోంది. ఈరోజే మోషన్ పోస్టర్ విడుదల చేసి ఆ విషయాన్ని కన్ఫామ్ చేశారు దిల్ రాజు.
నిజానికి బొమ్మరిల్లు సినిమా వచ్చాక అదే ఫార్మాట్లో మనకు చాలా కథలు వచ్చాయి. చాలా సినిమాలొచ్చాయి. స్వయంగా రాజు గారి క్యాంపు నుండే బోలెడన్ని సినిమాలొచ్చాయి కాని.. బొమ్మరిల్లును మాత్రం బీట్ చేయలేకపోయాయ్. ''శతమానంభవతి'' సినిమాతో ఆ లోటు తీరుతుందని ఆశిద్దాం.