మ‌ళ్లీ 1980ల్లోకి వెళ‌దామా!!

Update: 2018-04-06 11:50 GMT
‘రంగ‌స్థ‌లం’ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను 1980ల్లోని ప‌రిస్థితుల‌కు తీసుకెళ్లాడు లెక్క‌ల మాస్ట‌రు సుకుమార్‌. ఇప్పుడున్న హంగూ.. ఆర్భాటాలు లేని అచ్చ‌మైన‌... స్వ‌చ్ఛ‌మైన ప‌ల్లెటూరి ప‌రిమ‌ళాల‌ను ప‌రిచ‌యం చేసి... నాన్ బాహుబ‌లి ఇండ‌స్ట్రీ హిట్టు కొట్టేశాడు. ఇప్పుడు మ‌ళ్లీ ఆనాటి ప‌రిస్థితుల‌కు తీసుకెళ్ల‌బోతోంది మ‌రో సినిమా. తాజాగా విడుద‌లైన ఈ సినిమా లోకేష‌న్ స్టిల్స్ మూవీ ల‌వ‌ర్స్‌ ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి.

శ‌ర్వానంద్ హీరోగా సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌బోతున్న విష‌యం తెలిసిందే. ‘మ‌హానుభావుడు’ సినిమా త‌ర్వాత శ‌ర్వానంద్ ఈ సినిమానే చేయాల్సి ఉంది. అయితే హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి డేట్స్ దొర‌క‌డం క‌ష్ట‌మ‌వ్వ‌డంతో ముందుగా హ‌ను రాఘ‌వ‌పూడి సినిమా చేశాడు శ‌ర్వానంద్‌. ‘ప‌డి ప‌డి లేచెను మ‌న‌సు’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా పూర్తి కావ‌స్తుండ‌డంతో సుధీర్ వ‌ర్మ సినిమా మీద ఫోక‌స్ పెట్ట‌బోతున్నాడు శ‌ర్వానంద్‌. ఇప్ప‌టికే ప్రీ పొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌లు పెట్టి షూటింగ్‌ కి స‌ర్వం సిద్ధం చేస్తున్నాడు సుధీర్‌. ‘మ‌గ‌ధీర‌’ - ‘మ‌ర్యాద‌రామ‌న్న‌’ - ‘భాగ‌మ‌తి’ సినిమాల‌కు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేసిన ర‌వీంద‌ర్ రెడ్డి... సుధీర్ రెడ్డి సినిమా కోసం 80ల నాటి వైజాగ్ ప‌రిస‌రాల‌ను సిద్ధం చేశారు.

టీ కొట్టు- పాత బంగాళాలు- 1982 వైజాగ్ బ‌స్టాండ్‌... ఆనాటి దృశ్యాల‌ను ప్ర‌తిబింబించేలా వేసిన ఈ సెట్లో మొద‌టి షెడ్యూల్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. త‌ర్వాతి షెడ్యూల్ కాకినాడ పోర్టులో... మూడో షెడ్యూల్ కోసం హైద‌రాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో కోటి రూపాయ‌ల‌తో సెట్ వేయ‌నున్నారు.
Tags:    

Similar News