వెర్సటైల్ స్టార్ శర్వానంద్ నటనలోకి రావడం యాథృచ్ఛికం. అతడు చిరంజీవి ఇంట బాలకుడి వయసు నుంచి ఎక్కువగా ఉండేవాడు. రామ్ చరణ్ కి క్లోజ్ ఫ్రెండ్. ఆ క్రమంలోనే చిరు అనుకోకుండానే ఒకసారి ఓ మూవీలో బాటనటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత థమ్సప్ యాడ్ లో కలిసి నటించే అవకాశం వచ్చింది. అటుపై శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో ఒక పాటలో మెరుపులాంటి సీన్ల లో కనిపించి ఆకట్టుకున్నాడు.
శర్వా మనసులో ఏం ఉన్నా బయటికి చెప్పడని.. అంతర్ముఖుడని కూడా శ్రీకారం ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరు అనడం ఆసక్తికరం. అలాంటివాడిని నటుడిని చేశారు చిరు. అంతే ఒద్దికగా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ నటుడిగానూ ఎదిగాడు. శ్రీకారం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఖమ్మంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై శర్వానంద్ ని అతడి టీమ్ ని ఆశీర్వదించారు.
ఈ వేదికపై ఆశీర్వాదం కోసం ఎంతో వినమ్రంగా ఇలా మెగాస్టార్ చిరంజీవి పాదాలను తాకారు శర్వా. చిరు అతడిని ఆప్యాయంగా కౌగిలించుకుని గొప్ప విజయం సాధించాలని ఆశీర్వదించారు. ఆ దృశ్యం శర్వానంద్ అభిమానుల్లో ఎమోషన్ ని రగిలించింది. మార్చి 11న శ్రీకారం థియేటర్లలోకి వస్తోంది.