గులాబీ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమై.. తర్వాత పలు చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన శశిప్రీతమ్ పై దాడి జరిగింది. అయితే.. అతనిపై దాడి చేసిన వ్యక్తి.. శశిప్రీతమ్ ఇంటి ఎదురుగా ఉండే వ్యక్తే కావటం గమనార్హం. శశిప్రీతమ్ పై దాడి చేసిన వ్యక్తిని భానుప్రసాద్ గా గుర్తించారు. ఇద్దరి మధ్య గతంలోనూ విభేదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
గతంలో వీరిద్దరూ పలు సందర్భాల్లోఘర్షణ పడ్డారని.. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ మీద దాడి చేయటంతో.. ఆయన ముఖం మీద గాయమైంది. తనపై దాడి జరిగిందంటూ శశిప్రీతమ్.. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎదురెదురు ఇళ్లల్లో ఉంటున్న వీరి మధ్య గతంలోనూ పలుమార్లు ఘర్షణ జరిగినట్లుగా చెబుతున్నారు.
2012లో గ్రామీణాభివృద్ధిశాఖ రూపొందించిన అల్బం కోసం శశిప్రీతమ్.. భానుప్రసాద్ లు పోటీ పడగా.. ఆల్బమ్ తయారు చేసే కాంట్రాక్టు శశిప్రీతమ్ కు దక్కింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ విబేధాలతోనే తాజా దాడి జరిగి ఉంటుందని చెబుతున్నారు.