ట్రైలర్ టాక్: శతమానం అందరివాడులే

Update: 2017-01-03 13:14 GMT
ఇప్పుడు సంక్రాంతి రేసులో మెగాస్టార్ 150వ సినిమా బాలయ్య 100వ సినిమాతోపాటు.. శర్వానంద్ కొత్త సినిమా కూడా ఉంది. అదే ''శతమానం భవతి''. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అంటూ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్న దిల్ రాజు.. ఈ సినిమాను జనవరి 14న దించేస్తున్నారు. రైటర్ వేగేశ్న శతీష్‌ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు సాయంత్రమే విడుదలైంది.

చాలారోజుల వరకు తన తల్లిదండ్రులును చూడని ఒక లేడీ (ఇంద్రజ).. వాళ్ళు (ప్రకాష్‌ రాజ్ అండ్ జయసుధ) పిలవడంతో.. వెంటనే ఇండియా వచ్చేసింది. వారి కూతురు (అనుపమ పరమేశ్వరన్) అక్కడ తన బావ.. అత్తయ్య కొడుకుతో లవ్ లో పడుతుంది. ఆ తరువాత ఎలాంటి తేడాలు వచ్చాయి.. ఏం జరిగింది.. అనేదే కథ. అయితే ఏ సీన్లో కూడా ప్రకాష్‌ రాజ్ తాతగారు ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం చూస్తుంటే యాజిటీజ్ మనకు రామ్ చరణ్‌ ''గోవిందుడు అందరివాడేలే'' గుర్తొస్తుంది అంతే. అక్కడ మనవడు అమెరికా నుండి వస్తాడు.. ఇక్కడ మనవరాలు వచ్చింది. అంతే తేడా. ఇక కేవలం శతమానం గురించే చెప్పుకుంటే.. కథ రొటీన్ గా అనిపించినా కూడా.. శర్వా అండ్ అనుపమ షో స్టీల్ చేశారు. అలాగే సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫీ అదిరిపోయింది. మిక్కి జె మేయర్ మ్యూజిక్ మాత్రం ఎక్కడో విన్నట్లే ఉందిలే.

ఇకపోతే గత సంవత్సరం కూడా సంక్రాంతికి ఇదే విధంగా అమెరికా నుండి ఇండియా వచ్చే నాగర్జున కథతో సోగ్గాడే చిన్ని నాయనా వచ్చింది. అందులో కూడా నాగ్ ఫాథర్ రోల్ ఒక పల్లెటూరి అబ్బాయే. (ఆ పాత్ర కూడా నాగే వేశాడులే). ఈ సంక్రాంతికి కూడా అలాగే ఎన్నారై గాళ్‌ అండ్ పల్లెటూరి బాయ్ కథ చూడబోతున్నాం. ఏవిటో ఈ కోయిన్సిడెన్సులు!!

Full View
Tags:    

Similar News