ఇండస్ట్రీలో కొన్ని గ్యాంగుల వల్లే సుశాంత్ మరణించాడు: ఆర్జేడీ నాయకుడు

Update: 2020-07-01 15:00 GMT
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నెల 14న తన ఇంట్లోనే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడటంతో ఎన్నో అనుమానాలకు దారితీసింది. కెరీర్ పరంగా ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ ఇలా సూసైడ్ చేసుకోవడం ఏ ఒక్కరూ జీర్ణించుకోలేక పోతున్నారు. సుశాంత్ చనిపోయినపుడు అతని ఇంట్లో సూసైడ్ నోట్ లేకపోవడం.. పైగా ఎలాంటి ఆధారాలు కూడా లభించకపోవడంతో ఈ ఘటన ఎన్నో చర్చలను లేవనెత్తింది. తాజాగా ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను కలిసిన శేఖర్‌ సుమన్‌ దీని గురించి చర్చించానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కంటికి కనిపించే దాని కంటే ఎక్కువగా ఏదో జరిగినట్లు సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయి.

ఇవన్నీ చూస్తుంటే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడం వెనక ఏదో కుట్ర ఉన్నట్లు అనిపిస్తుంది. దీని గురించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. అంతేకాక ఓ సిండికేట్‌, మాఫియా చిత్రపరిశ్రమను నడిపిస్తున్నాయి. ఇవే ఓ యువ నటుడి భవిష్యత్తును నాశనం చేశాయి. ఈ సిండికేట్‌లో భాగస్వాములైన స్టార్లందరు తనకు తెలుసని.. కానీ సరైన ఆధారాలు లేనందున వారి పేర్లు వెల్లడించడం లేదు. ఇంకా సుశాంత్‌ గత నెలరోజుల వ్యవధిలోనే దాదాపు 50 సిమ్‌ కార్డులు మార్చాడు. ఎవరి నుంచి తప్పించుకోవడం కోసం అతడు ఇలా చేశాడు. వృత్తిపరమైన శత్రువులు ఎవరైనా ఉన్నారా తెలియాలి. బంధుప్రీతి వల్ల సుశాంత్‌ చనిపోయాడని నేను అనుకోవడం లేదు. ఇండస్ట్రీలోనే గ్యాంగ్‌ల వల్లే సుశాంత్‌ మరణించాడు’ అంటూ శేఖర్‌ సుమన్‌ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం శేఖర్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట సంచలనంగా మారుతున్నాయి.
Tags:    

Similar News