షేర్‌ పటాసులు పేలుస్తాడా?

Update: 2015-07-04 16:14 GMT
పటాస్‌తో బాక్సాఫీస్‌ హిట్‌ కొట్టాడు కళ్యాణ్‌రామ్‌. గతాన్ని మర్చిపోయేంత హిట్టొచ్చిందని నందమూరి అభిమానులంతా ఖుషీ అయిపోయారు. సింహం ఆకలేసింది కదా అని పచ్చగడ్డి తినదు. సింహం సింహంలానే ఉంటుంది! అంటూ కళ్యాణ్‌రామ్‌ వ్యక్తిత్వాన్ని బహిరంగంగా పొగిడేశాడు ఎన్టీఆర్‌ అంతటివాడు. నిజమే సింహం సింగిల్‌గానే వస్తుంది. జింకను వేటాడి వెళుతుంది. వేటలో కాస్త ఆలస్యం అవుతుంది అంతే అని నిరూపించాడు కళ్యాణ్‌రామ్‌. ఈ ఏడాదిలోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సినిమాల్లో పటాస్‌ టాప్‌ ఆర్డర్‌లో నిలిచింది.

మరి అలాంటి హిట్‌ కొట్టినవాడు ఆ జోష్‌ని అలానే కొనసాగించాలి కాబట్టి అందుకోసం అహోరాత్రులు శ్రమిస్తున్నాడిప్పుడు. హిట్టు వెంటే హిట్టు పట్టేయాలని తహతహలాడుతున్నాడు. ఇంతకుముందు 'కత్తి' చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిఖార్జున్‌ని బలంగా నమ్మి మరో ఎటెంప్ట్‌ చేస్తున్నాడు. ఈ కలయికలో షేర్‌ తెరకెక్కుతోంది. ఈరోజుతో టాకీ చిత్రీకరణ పూర్తయంది. సోనాల్‌ చౌహాన్‌, హీరో జోడీపై పాటల్ని తెరకెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో భాగంగా రీరికార్డింగ్‌ చేస్తున్నారు. షేర్‌ పంజా విసిరే టైమ్‌ దగ్గరపడుతోందన్నమాట!

Tags:    

Similar News