కొత్త కథానాయికలు ఎంతమంది వచ్చినా బాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ హీరోయిన్స్ ఎప్పటికీ ఒకేరకమైన క్రేజ్ కొనసాగిస్తుంటారు. వారు సినిమాలు చేసినా చేయకపోయినా సరే వాళ్ల పాపులారిటీ ఏమాత్రం తగ్గదు.
అలాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు శిల్పా శెట్టి, అడపాదడపా సినిమాలు చేసినా బుల్లితెర మీద ఆమె సందడి చేస్తుంది. కేవలం బాలీవుడ్ సినిమాలే కాకుండా సౌత్ సినిమాలు ముఖ్యంగా తెలుగు సినిమాల్లో కూడా నటించి ఇక్కడ ప్రేక్షకులను అలరించింది శిల్పా శెట్టి.
వెంకటేష్ తో సాహసవీరుడు సాగరకన్య.. మోహన్ బాబుతో వీడెవడండీ బాబు.. నాగార్జునతో ఆజాద్ సినిమాల్లో నటించిన శిల్పా శెట్టి బాలకృష్ణతో భలేవాడివి బాసు సినిమాలు చేసింది. బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో కొన్నాళ్లు తన హవా కొనసాగించిన శిల్పా శెట్టి అవార్డులు, రివార్డులతో ఇండియన్ ఆడియన్స్ ని మెప్పించింది. ప్రత్యేకంగా ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ షో మూలమైన బిగ్ బ్రదర్ షోలో ఇండియా నుంచి ఆమె పాల్గొన్నది.
వయసు మీద పడుతున్నా కూడా అమ్మడు గ్లామర్ విషయంలో మేటి హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా ఉంది. బాలీవుడ్ లో 7 ఏళ్ల దాకా కెరియర్ గ్యాప్ ఇచ్చిన శిల్పా శెట్టి రీసెంట్ గా నికమ్మ, హంగామా 2 సినిమాల్లో నటించింది. టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న సందర్భంగా మళ్లీ తెలుగు సినిమాల్లో నటించాలని చూస్తుంది శిల్పా శెట్టి. ఇప్పటికే మహేష్, త్రివిక్రం కాంబోలో వస్తున్న మూవీలో ఆమెని తీసుకున్నట్టు టాక్.
ఒకప్పటి హీరోయిన్స్ ని తన సినిమాల్లో బలమైన పాత్రలు ఇచ్చి వారికి.. వారి వల్ల సినిమాకు క్రేజ్ వచ్చేలా చేస్తాడు త్రివిక్రం. మరి ఆయన సినిమాలో శిల్పా శెట్టి ఫిక్స్ అయితే మాత్రం ఆమె పాపులారిటీకి తగిన పాత్ర ఇస్తారని ఆశించవచ్చు. ఇదేకాకుండా కొరటాల శివ, తారక్ కాంబో సినిమాలో వస్తున్న ప్రాజెక్ట్ లో కూడా శిల్పా శెట్టి నటిస్తుందని అంటున్నారు.
ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి ఫిక్స్ అయినా శిల్పా శెట్టికి మళ్లీ తెలుగులో అవకాశాల ద్వారాం తెరచుకున్నట్టే లెక్క. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సుఖీ మూవీలో శిల్పా శెట్టి నటిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.