శిల్పాశెట్టికి షాకిచ్చిన హైకోర్టు.. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోలేం

Update: 2021-07-31 03:56 GMT
దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన రాజ్ కుంద్రా అశ్లీల వీడియోల కేసులో ఆయన భార్య శిల్పాశెట్టి తాజాగా న్యాయస్థానం మెట్లు ఎక్కింది. అయితే బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కేసుకు సంబంధించి వార్తా ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో కథనాలు రాకుండా అడ్డుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.  మీడియా స్వేచ్ఛను అడ్డుకోలేమని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది.  మీడియాలో వస్తున్న వందల కథనాలను తాము అడ్డుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.

అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారించారు. విచారణ సందర్భంగా శిల్పాశెట్టి భావోద్వేగానికి గురై పోలీసుల ఎదుట ఏడ్చేసిందని క్రైం బ్రాంచ్ వర్గాల ద్వారా మీడియా రిపోర్టులు రాసింది.. తాజాగా ముంబైలోని జుహులో ఉన్న శిల్పాశెట్టి నివాసంలో ఆమెను పోలీసులు విచారించారు. ప్రధాన నిందితుడు రాజ్ కుంద్రా భార్య, ప్రముఖ నటి బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిని విచారించి.. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. విచారణ సందర్భంగా తన భర్త రాజ్ కుంద్రాను శిల్పాశెట్టి వెనకేసుకొచ్చినట్టు  మీడియాలో వార్తలు వస్తున్నాయి.  రాజ్ కుంద్రా అమాయకుడని.. ‘ఎరోటికా’కు ‘అశ్లీల వీడియోల’కు తేడా ఉందని.. ‘ఎరోటికా’ అశ్లీలం కాదని శిల్పా విచారణలో తెలిపినట్టు సమాచారం. యాప్ నిర్వహణ అంతా లండన్ లో ఉన్న రాజ్ కుంద్రా బావమరిది ప్రదీప్ భక్సిదేనని శిల్పాశెట్టి చెప్పినట్టు సమాచారం.  తన భర్త రాజ్ కుంద్రా నిర్ధోషి అని శిల్పా క్రైమ్ బ్రాంచ్ కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.

ఇక హాట్ సాట్ యాప్ లోని కంటెంట్ కు, తనకు దాని గురించి ఏమీ తెలియదని పేర్కొన్నట్టు చెబుతున్నారు. తనకు హాట్ షాట్ తో సంబంధం లేదని.. తన భర్త రాజ్ కుంద్రాకు ఆ అశ్లీల కంటెంట్ కు ప్రొడక్షన్ లో పాల్గొనలేదని ఆమె చెప్పారట.. ఆ మెటీరియల్ తయారీలో పాల్గొనలేదని ఆమె చెప్పినట్టు తెలిసింది. ఈ విచారణలో తన భర్తను శిల్పా వెనకేసుకొచ్చినట్టు తెలుస్తోంది.  ఇదంతా కూడా క్రైం బ్రాంచ్ ద్వారా మీడియాలో పుంఖానుపుంకాలుగా వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలోనే మీడియా కథనాలు, సోషల్ మీడియా ద్వారా  తమ పరువుకు భంగం కలుగుతోందని.. పలు మీడియా సంస్థలు, ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో తమ గురించి ప్రచురితమవుతున్న కథనాలను అడ్డుకోవాలని కోరుతూ పరువు నష్టం దావా వేసింది.

శిల్పా శెట్టి వేసిన పిటీషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా శిల్పాశెట్టి తరుఫున హాజరైన న్యాయవాది బీరేన్ సరాఫ్ వాదించారు. ‘భార్యభర్తల మధ్య జరిగిన సంభాషణ గురించి కూడా మీడియాలో రాయడం సరికాదని’ అని వాదించారు.

ఇందుకు స్పందించిన జస్టిస్ గౌతం పటేల్ ‘పోలీసులు చెప్పిన వివరాల గురించి ప్రసారం చేయడం పరువుకు నష్టం కలిగించినట్లు కాదు.. ఇలా ప్రతి అంశాన్ని అడ్డుకోవాలంటే అది పత్రికా స్వేచ్ఛ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. శిల్పాశెట్టి భావోద్వేగానికి లోనుకావడం వంటి విషయాలు పోలీసులే ముందే జరిగాయని.. క్రైం బ్రాంచ్ వర్గాలు చెప్పిన వివరాలు ఆధారంగా మీడియా రిపోర్టులు వచ్చాయి’ అని పేర్కొన్నారు.

శిల్పాశెట్టి ప్రముఖ హీరోయిన్.. ఆమె పబ్లిక్ ఫిగర్.. పబ్లిక్ లైఫ్ లో ఉన్న మీ జీవితాన్ని మైక్రోస్కోప్ నుంచి చూసినంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చే సమయంలో మీరు ఏడ్చారు.. మీ భర్తతో గొడవపడ్డారు’ అన్న అంశాలు పరువునష్టం కిందకు రావని తెలిపారు. మీరు కూడా ఒక మనిషి కదా అన్న భావనను మాత్రమే స్ఫూరిస్తాయి అని హైకోర్టు అభిప్రాయపడింది.

మీడియా స్వేచ్ఛను అడ్డుకునేలా తాము వ్యవహరించలేమని స్పష్టం చేశారు. అయితే పిల్లల పెంపక విషయంలో శిల్పాశెట్టి తీసుకున్న నిర్ణయం విషయంలో ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యమిస్తూ సంయమనం పాటించాల్సిందని మీడియాకు హితవు పలికారు.
Tags:    

Similar News