సమంత కథానాయకగా వచ్చిన లేడీ ఓరియంటెడ్ మూవీ యశోద సినిమా ఇటీవల థియేటర్లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఓపెనింగ్స్ కాస్త తక్కువగానే వచ్చినప్పటికీ వారంతరం మంచి కలెక్షన్స్ అందుకొని సేఫ్ జోన్ లో అయితే కొనసాగుతోంది. ఈ సినిమా విడుదల ప్రమోషన్స్ లో కూడా సమంత పెద్దగా పాల్గొనలేకపోయింది. ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం వలన చిత్ర యూనిట్ కూడా సమంత లేకుండానే ప్రమోషన్స్ చేశారు.
ఇక అప్పుడప్పుడు సమంత సోషల్ మీడియాలో మాత్రమే ఈ సినిమా గురించి చెబుతూ వస్తోంది. అయితే సినిమా థియేటర్లో ఉండగానే ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక హాస్పిటల్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటీటీలో ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను విడుదల చేయకూడదని డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు టాక్ రావడంతో ఈ విషయంలో సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎందుకంటే ఈ సినిమాలో ఇవా హాస్పిటల్ ప్రతిష్ట దెబ్బతినేలా పలు సన్నివేశాలు చూపించారు అని హాస్పిటల్ యాజమాన్యం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో సిటీ సివిల్ కోర్టు ఈ సినిమా ఓటీటీ లో విడుదల చేయడానికి వీలులేదు అనే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పుడు ఓటీటీ సంస్థ నిర్మాతల మధ్య మరో కొత్త వివాదం తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
డీల్ ప్రకారం అనుకున్న సమయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను ఓటీటీ లో విడుదల చేసే విధంగా నిర్మాతలు సిద్ధంగా ఉండాలి. అయితే ఇప్పుడు వారి కారణంగా కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఓటీటీ సంస్థకు ఇబ్బందులు ఎదురయ్యాయి. కాబట్టి ఆర్థికంగా కూడా ఈ విషయంలో ఓటీటీ సంస్థలు కోత విధించే అవకాశం కూడా ఉంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.