తమ అభిమాన హీరో హీరోయిన్స్ ఫొటోలను కొందరు తమ కంప్యూటర్ లేదా మొబైల్ వాల్ పేపర్స్ గా పెట్టుకుంటే మరి కొందరు వారి పోస్టర్స్ ను ఇంట్లో లేదా వర్క్ ఏరియాలో పెట్టుకుంటారు. ఇక చిన్న చిన్న షాప్స్ వారు వారి పబ్లిసిటీ కోసం కూడా తమ అభిమాన నటీనటుల ఫొటోలను పెట్టుకుంటూ ఉంటారు. అయితే పెద్ద కంపెనీలు అనుమతి లేకుండా ఫొటోలు వాడుకుంటే ఊరుకోని సెలబ్రెటీలు చిన్న చిన్న షాపుల వారు ఫొటోను వాడితే చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు. కాని శృతి హాసన్ ఫొటో వాడినందుకు ఒక సాదారణ వ్యాపారికి ఫైన్ పడింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని ఒక చిన్న షాపు యజమాని తన షాప్ అందంగా ఆకర్షనీయంగా కనిపించాలనుకున్నాడో మరేంటో కాని తనకు ఇష్టం అయిన శృతి హాసన్ ఫొటోలను పెట్టుకున్నాడు. ఆ షాపు యజమాని శృతి హాసన్ ఫొటోలను అనుమతి తీసుకోకుండా పెట్టుకున్నట్లుగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో ఆ షాపుపై రైడ్ చేసిన అధికారులకు నిజమే అని తేలింది.
అతడిని ప్రశ్నించగా తాను ఆమె నుండి అనుమతి తీసుకోలేదని.. తనకు తెలియక ఆమె ఫొటోలు వాడానని అలాంటి పర్మీషన్స్ ఉంటాయనే విషయం కూడా తనకు తెలియదు అంటూ నెత్తి నోరు కొట్టుకున్నాడు. అయినా కూడా అధికారులు అతడికి ఏడు వేల రూపాయల ఫైన్ విధించి అక్కడ నుండి వెళ్లారు. చేసేది లేక ఆ ఫైన్ చెల్లించి తన షాపు నుండి శృతి హాసన్ ఫొటోలను తొలగించేశాడు.