శౌర్య కోసం ప్లానింగ్ సూపర్!!

Update: 2015-12-17 04:09 GMT
మంచు మనోజ్ - రెజీనా కసాండ్రా జంటగా తెరకెక్కుతున్న చిత్రం శౌర్య. క్లాస్ మూవీస్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దశరథ్ దీనికి దర్శకుడు. ఈ చిత్రానికి ప్రమోషన్ చాలా డిఫరెంట్ గాను, పక్కా ప్లానింగ్ తోనూ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

శౌర్య.. ముందు టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌ అంటూ నిర్వహించారా. తరువాత వాల్‌ పోస్టర్ లాంచ్‌ ఈవెంట్‌ ఒకటి సెలబ్రేట్ చేశారు. ఇప్పుడు మోషన్‌ పోస్టర్‌ లాంచ్‌ ఈవెంట్‌ అంటూ మరో కార్యక్రమాన్ని కూడా జరిపారు. ఇక మీదట మనకు తెలిసిన టీజర్ - ట్రైలర్ - ఆడియో - సాంగ్ ప్రోమోస్ కూడా వరుసగా వస్తాయని అర్ధం చేసుకోవచ్చు.  ఇదంతా చూస్తుంటే బాలీవుడ్‌ తరహాలో గాట్టి ప్రమోషనే ప్లాన్‌ చేశారు. హైప్ తీసుకురావడం కోసం యూనిట్ బాగానే ట్రై చేస్తున్నారు. సాధారణంగా క్లాస్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా సినిమాలు తీసే దశరథ్.. ఈసారి తన అలవాటుకు మరో కొత్త జోనర్ ని యాడ్ చేసినట్లు చెబుతున్నారు. హీరోని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో సాఫ్ట్ గానే చూపిస్తున్నా.. ఇదో థ్రిల్లర్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అలాగే హీరోయిన్ కేరక్టర్ కి కూడా చాలానే ఇంపార్టెన్స్ ఉంటుందని టాక్.

డిసెంబర్ చివరికల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసేయాలన్నది శౌర్య మేకర్స్ ప్లానింగ్. ఈ టీం ప్లానింగ్ అంతా బాగానే ఉంది. కాకపోతే వరుస సినిమా రిలీజ్ లతో అనుకున్నంత హైప్‌ రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఆడియో - ట్రైలర్ కూడా వచ్చేస్తే మాత్రం.. అప్పుడు శౌర్య తన ప్రతాపం పూర్తి స్థాయిలో చూపించే ఛాన్సులున్నాయి.

Tags:    

Similar News