మరోసారి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇదివరకే కొంతమంది ప్రముఖ నటీనటులు డ్రగ్స్ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే.
బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికి వారిపై నిత్యం ఏదో ఒక ఆరోపణ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. ఇక రీసెంట్ గా మరొక బాలీవుడ్ సెలబ్రెటీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆరోపణలు ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది.
అతను మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంటున్న శ్రద్ధాకపూర్ సోదరుడు అని తెలుస్తోంది. రీసెంట్ గా ముంబైలోని ఒక ప్రైవేట్ పంబ్ పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించడంతో అక్కడ కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన అధికారులకు నిజంగా డ్రగ్స్ వినియోగించినట్లు నిర్దారణ అయ్యింది.
వెంటనే పార్టీలో అనుమానం కలిగిన 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక అందులో బాలీవుడ్ ఇండస్ట్రీ ఫ్యామిలిస్ కు చెందిన 5 మంది ఉన్నట్లు సమాచారం. అలాగే శ్రద్ధ కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ కూడా అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక వెంటనే పోలీసులు అతన్ని విచారణ జరిపి మంగళవారం ఉదయం బెయిల్ మీద వదిలేసినట్లు తెలుస్తోంది.
అలాగే మరో నలుగురికి కూడా బెయిల్ వచ్చినట్లు సమాచారం. ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై టాస్క్ ఫోర్స్ అధికారులు కాస్త సీరియస్ గానే విచారణలు కొనసాగిస్తున్నారు. ఆ మధ్య షారుక్ ఖాన్ కొడుకు కూడా అదే ఆరోపణలపై అదుపులోకి తీసుకోగా ఆ తరువాత అతను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని వదిలేశారు.
కానీ అతని స్నేహితులు మాత్రం డ్రగ్స్ తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇక ఈ క్రమంలో తరచుగా అధికారులు ముంబైలో అనుమానం ఉన్న పబ్స్ పై కాస్త ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఇక ఇప్పుడు శ్రద్ధ కపూర్ సోదరుడు సిద్ధాంత్ కపూర్ కూడా అరెస్ట్ కావడంతో మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే అతను మరో విచారణను ఎదుర్కొనే అవకాశం ఉంది.