ఈ లోకమే మా చెడ్డది. అందరినీ ప్రశ్నలతో వేధించడమే పనిగా ఉంటుంది. సింగిల్ గా ఉంటే చాలు.. షాదీ కబ్? అంటారు.. సరే ఖర్మ కాలి షాదీ చేసుకుంటే బచ్చే కబ్? అంటారు. ఆ బచ్చే వచ్చారనుకోండి.. స్కూల్ గురించి అడుగుతారు. ఆ తర్వాత వారి మార్కులు.. కాలేజి.. మార్కులు.. మళ్ళీ పెళ్ళి.. మళ్ళీ పిల్లలు. ఈ దరిద్రం పోవాలంటే ఒకటే మార్గం. చావడమే! అయితే ఇంత చిన్న విషయానికి ఎవరూ చావరు కానీ సమాధానం చెప్పలేక చస్తూ ఉంటారు. కొందరేమో చలాకీగా జవాబు చెప్పి ప్రశ్నలు అడిగిన వారి నోరు మూయిస్తారు.
బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రియ లాస్ట్ ఇయర్ మార్చ్ లో తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోస్చీవ్ ను రాజస్థాన్ లోని ఉదయపూర్ లో మనువాడింది. ఆండ్రీ మన ఇండియన్ బాబు కాదు.. అందమైన రష్యా మ్యాన్. ఎందుకో తెలీదు కానీ శ్రియ తన భర్తగారి ఫోటోలను నిన్నమొన్నటివరకూ సీక్రెట్ గా ఉంచింది. కానీ రెండు మూడు రోజుల క్రితం భర్తగారితో సరసాలాడుతూ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ చేసింది. ప్రస్తుతం వారిద్దరూ మెక్సికో.. పెరూ.. కొలంబియా.. ఇలా చుట్టేస్తున్నారట. ఈ ఊపు చూస్తుంటే ఇదేదో నెవర్ ఎండింగ్ హనీమూన్ లా ఉందని త్వరలో శ్రియ ఓ చల్లని వార్త చెబుతుందని మీరు అనుకోవద్దు.
కారణం ఏంటంటే ఈమధ్య ఒకసారి తమిళ మీడియావారు శ్రియ ను సంతానం గురించి అడిగారు . దీంతో ఇప్పుడే పిల్లల గురించి ఆలోచించడం లేదని.. లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాని.. కెరీర్ ను కూడా ఇంకా కొనసాగించాలని అనుకుంటున్నానని తెలిపింది. మరో ఇరవై సినిమాలు చేసిన తర్వాతే పిల్లలైనా పీచులైనా.. అని తేల్చేసింది. క్లారిటీ ఇచ్చింది కాబట్టి మీరు ఎక్కడైనా శ్రియ పిల్లల గురించి చెత్త గాసిప్పులు వస్తే నమ్మకండి.