ప‌బ్లిక్ లో ఆయ‌న‌తో శ్రీయ చిలిపి వేషాలు!

Update: 2021-09-10 02:30 GMT
బోల్డ్ బ్యూటీ శ్రియా టెంప్టింగ్ ఫోటోషూట్లు అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. హ‌బ్బీతో ప‌బ్లిక్ ప్లేస్ లో రొమాన్స్ కూడా అంతే వైర‌ల్ అవుతోంది. అమ్మ‌డు ఆన్ స్క్రీన్ ని మించి ఆఫ్ ది స్క్రీన్  మ‌రింతగా చెల‌రేగుతోంది. అదీ పెళ్లైన త‌ర్వాత మ‌రింత‌గా రెచ్చిపోతూ మ‌తులు చెడ‌గొడుతోంది. ఇటీవ‌లే ఓ విదేశీ రీసార్స్ట్ లో హాబ్బీ ఆండ్రూతో క‌లిసి చిలౌట్ అవుతోన్న హాటెస్ట్ ఫోటోల్ని లీక్ చేసి షాకిచ్చింది. వైఫ్  థై అందాల‌పై హ‌బ్బీ ఆండ్రూ ఆపిల్ పండ్లు క‌ట్ చేస్తోన్న ఫోటోల్ని తానే స్వ‌యంగా ఇన్ స్టాలో షేర్ చేసి మ‌తులు చెడ‌గొట్టింది. ఇట్స్ స్నాక్స్ టైమ్ అంటూ ట్యాగ్ చేసింది. ఆ ఫోటోల‌పై ఓ రేంజ్ లో కామెంట్లు ప‌డ్డాయి. అదే స్థాయిలో శ్రియ పై విమ‌ర్శ‌లు పీక్స్ కి చేరాయి.

తాజాగా ఆయ‌న‌తో మ‌రోసారి ముంబై వీధుల్లోనే ఘాటైన‌ పోటోల‌కు ఫోజులిచ్చి షాకిచ్చింది. బ్లాక్ డ్రెస్ లో శ్రియ ఇన్న‌ర్ ఎలివేష‌న్ ఈ ఫోటోషూట్ లో హైలైట్ చేసింది.   పొట్టి నిక్క‌ర్ లో థై అందాల‌తోనూ  కాక‌లు రేపుతోంది. ఆండ్రూతో లిప్ లాక్ వేస్తోన్న మ‌రో ఫోటోని కూడా లీక్ చేసి బోర్డ‌ర్ దాటిన‌ట్లే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా  మారాయి. ఫోటోల‌పై కామెంట్లు హ‌ద్దులు మీరాయి. ప్ర‌యివేట్ ప్లేస్ లో చేయాల్సిన ప‌నులు ప‌బ్లిక్ గా ఏంటి? అంటూ అభిమానులు త‌న‌ని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి కామెంట్ల‌ను శ్రియ ఖాత‌రు కూడా చేయ‌దు. ఎలాంటి విమ‌ర్శ‌లైనా.. వ్య‌తిరేక‌త‌ను అయినా `డోంట్ కేర్` అంటూ త‌న ప‌ని తాను చూసుకుపోతోంది.

ఇక శ్రియ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల భ‌ర్త‌తో క‌లిసి ముంబైలో సెటిలైంది. అటు హిందీ ఇటు తెలుగు త‌మిళ ప‌రిశ్ర‌మ‌ల్లో బిజీ అయ్యేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉంది. ప్ర‌స్తుతం ప్రొఫెష‌న‌ల్ కెరీర్ లోనూ బిజీనే. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` లో కీల‌క పాత్ర పోషిస్తుంది. అలాగే `గ‌మ‌నం` అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తోంది. మ‌రోవైపు కోలీవుడ్ లోనూ అవ‌కాశాలు అందుకుంటోంది. ప్ర‌స్తుతం ఓ సినిమా సెట్స్ లో ఉంది. మ‌రో సినిమాకు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. బాలీవుడ్ లో `త‌డ్కా` చిత్రంలో నేటిస్తోంది. ఈ సినిమా షూటిండ్ డిలే అవుతోంది.

సంగీతం నేప‌థ్యంలోనూ ఓ చిత్రం

శ్రియా శ‌ర‌న్ సంగీతం నేప‌థ్యంలో ఓ చిత్రం చేస్తోంది. శ‌ర్మాన్ జోషి క‌థానాయ‌కుడు. మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత సారథ్యంలో యామిని ఫిలింస్ చిత్రం `మ్యూజిక్ స్కూల్`ని తాజాగా ప్ర‌క‌టించారు. యామిని ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  తెలుగు- హిందీ భాష‌ల్లో రూపొంద‌నున్న ఈ చిత్రానికి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. బ్రాడ్ వే కొరియోగ్రాఫ‌ర్ ఆడ‌మ్ ముర్రే కొరియోగ్ర‌ఫీ అందిస్తున్నారు. పాపారావు బియ్యాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో సుహాసిని ములే- బెంజిమిన్ గిలాని- ప్ర‌కాశ్‌రాజ్‌- బ్ర‌హ్మానందం ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. జోధా అక్బ‌ర్ వంటి చిత్రాన్ని అద్భుతంగా ఆవిష్క‌రించిన సినిమాటోగ్రాఫ‌ర్ కిర‌ణ్ డియోహ‌న్ ఈ చిత్రానికి విజువ‌ల్స్ అందిస్తున్నారు. అక్టోబ‌ర్ 15న మ్యూజిక‌ల్ ఈవెంట్ ప్రారంభం కానుంది.

ప్ర‌స్తుతం ఉన్న విద్యావిధానంలో పిల్ల‌లు కేవ‌లం డాక్ట‌ర్స్‌- ఇంజ‌నీర్స్ మాత్ర‌మే కావాలంటూ తెలియ‌ని ఓ ఒత్తిడికి లోన‌వుతున్నారు. వీట‌న్నింటిని తెలియ‌జేసి, అంద‌రినీ ఆలోచింప జేసేలా తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీలో 12 పాట‌లుంటాయి. హైద‌రాబాద్ లో ప్రారంభ‌మ‌య్యే ఈ కామిక్ మ్యూజిక‌ల్ జ‌ర్నీ ఎవ‌రైతే ప్రేమ‌- క‌ల‌లు క‌న‌డం న‌వ్వ‌డం పాట‌లు పాడాల‌నుకునే వారి కోరిక‌ను ప్ర‌తిధ్వ‌నించేలా ఉంటుంది.
Tags:    

Similar News