ఫోటో స్టోరిః బ్లాక్‌ లో అదరగొట్టేసింది

Update: 2015-08-23 07:53 GMT
శ్రుతిహాసన్‌ డ్రెస్సింగ్‌ సెన్స్‌ ఆల్‌ టైమ్‌ హాట్‌ టాపిక్‌. సందర్భాన్ని బట్టి ఫ్యాషన్స్‌ అండ్‌ ట్రెండ్స్‌ ని అనుసరిస్తుంటుంది. సౌత్‌ లో ఇప్పుడున్న స్టార్‌ హీరోయిన్ల లో శ్రుతి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అంటే అది ఇలాంటి ఎటెంప్ట్‌తోనే. ఎక్కడైనా ఓ  డిజైన్‌ పాపులర్‌ అయ్యింది అంటే.. అది తనకి నచ్చితే దానిని అనుకరించడానికి వెనకాడదు. డిజైనర్ల ను పిలిపించుకుని మరీ డిజైన్‌ చేయించుకుంటుంది. ఇలా చాలా సార్లు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. ట్రెండీ అనిపిస్తే వెంటనే ఆ డ్రెస్‌ తన వాడ్‌ రోబ్‌ లోకి రావాల్సిందే.

ఇదిగో నిన్నటి రోజున తన లేటెస్ట్‌ ఫిలిం 'వెల్‌ కమ్‌ బ్యాక్‌' కోసం ఓ నల్ల గౌనులో దర్శనమిచ్చిందిలా. ఈ డ్రెస్‌ డిజైన్‌ సింప్లీ సూపర్భ్‌. ఎక్కడ ఏ భాగాన్ని ఓపెన్‌ చేసి ఉంచాలో అది పక్కాగా ఓపెన్‌ చేసి డిజైన్‌ చేశారు. ఈ డ్రెస్‌ డిజైన్‌ చేసింది ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా.

బుల్లితెర కార్యక్రమం కామెడీ నైట్స్‌ విత్‌ కపిల్‌ లో ఇలా ఈ కొత్త లుక్‌ లో దర్శనమిచ్చింది. ఇటీవలి కాలంలో సైమా అవార్డ్స్‌ వేడుకల్లో ఓ కొత్త డిజైన్‌ తో ఆకట్టుకున్న శ్రుతిహాసన్‌ మళ్లీ అదిరిపోయే అప్పియరెన్స్‌ ఇచ్చింది ఈ ప్రమోషన్‌ కార్యక్రమంలోనే.
Tags:    

Similar News