సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ తన జీవితం గురించి ఏమనుకుంటుందో ఏమో గాని ఎవ్వరు తన విషయంలో జోక్యం చేసుకోవద్దని మాత్రం అనుకుంటోందని ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలో రూమర్స్ ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తున్నాయి. గత కొంత కాలంగా ఈ బ్యూటీ మైకేల్ కొర్సేల్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తోందని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నిసార్లు అమ్మడు బాయ్ ఫ్రెండ్ తో కనిపించినా కూడా ఏ మాత్రం బయటకి చెప్పుకోవడం లేదు.
ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ తో అమ్మడు ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా ఏ తారలైన ఒకసారి ప్రేమలో పడ్డారని బయటకు వస్తే ఎదో ఒక విధంగా స్పందిస్తారు. కానీ శృతి అలాంటి టాక్ ఎంత వరకు వస్తోన్న కూడా ఏ మాత్రం స్పందించడం లేదు. మొన్న తల్లితో ఆ తర్వాత నాన్నతో బాయ్ ఫ్రెండ్ తో కనిపించి సౌత్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఇప్పుడు ముంబై లో కనిపించి ఎవరు ఊహించని విధంగా దర్శనం ఇచ్చింది.
సింపుల్ గా జీన్స్ నార్మల్ టీ షర్ట్ తో బాయ్ ఫ్రెండ్ చేతిలో చెయ్యేసి నైట్ క్లబ్ కి వెళ్లి వచ్చింది. మీడియా కంటపడటంతో ఏ మాత్రం కెమెరాలను పట్టించుకోకుండా సైలెంట్ గా వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఓ ఫొటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. శృతి హాసన్ ఎంచక్కా బాయ్ ఫ్రెండ్ తో చక్కర్లు కొట్టేస్తోంది గాని రిలేషన్ పై ఒక వివరణ అధికారికంగా ఎందుకు ఇవ్వడం లేదో మరి. కాకపోతే ఈ ఫోటోలతో పదే పదే ఏదో మెసేజ్ ఇస్తోందనే అనుకోవాలి కదూ.