సినిమాల కన్నా యాడ్సే ముఖ్యమా?

Update: 2018-01-24 00:30 GMT
శ్రుతి హాసన్ సౌత్ టు నార్త్ టాప్ రేంజ్ కి వెళ్లిన హీరోయిన్. టాలీవుడ్ -  కోలీవుడ్ లలో అందరూ టాప్ హీరోలతోనూ నటించింది. క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. గతేడాది మాత్రం కాస్త జోరు తగ్గిందనే చెప్పాలి. సినిమాలలో పెద్దగా మెరవలేదు. వెండితెరను పట్టించుకోని ఈ హాట్ బ్యూటీ రోజూ చిన్నితెరపై మాత్రం సందడి చేస్తోంది.

తండ్రి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రుతి ... స్వయంగానే ఎదిగింది. కానీ తనకు రెగ్యులర్ ఒకే లాంటి పాత్రలు వస్తున్నాయని - బోరుకొడుతోందంటూ సినిమాలకు దూరంగా ఉంటోంది. గ్లామర్ డాల్ పాత్రలు తప్ప - నటనకు అవకాశం ఉన్నా పాత్రలేవీ రావడం లేదన్నది అమ్మడి బాధ. అందుకే కొన్ని నెలలుగా సినిమాలు చేయడం లేదు. సినిమాలు చేయడం లేదు సరే... మరి యాడ్స్ ఎందుకు చేస్తున్నట్టు అనేదే ప్రశ్న.

సినిమాలలో నచ్చనది...  యాడ్ ఫిల్మ్ లలో ఏం నచ్చిందో ఈ హాటీకి  రెచ్చిపోయి నటిస్తోంది.  ప్రకటన్లలో రోల్స్ కొత్తగా అనిపిస్తున్నాయేమో అందుకే చేస్తోందేమో మరి. లేదా యాడ్ కోసం కేవలం రెండు మూడు రోజులు యాడ్ చేస్తే చాలు... బోలెడంత సొమ్ము వసూలు చేయచ్చు. అదే సినిమా అయితే రోజుల తరబడి షూటింగ్ కు వెళ్లాలి. అందుకే యాడ్స్ బెటర్ అనుకుందేమో శ్రుతీ.  

తాజాగా వరుణ్ ధావన్ తో కలిసి ఫాసిల్ వాచ్ యాడ్ లో మెరుపులు మెరిపిస్తోంది అమ్మడు. సింపుల్ గా, అందంగా కనిపిస్తోంది ఆ యాడ్లో.
Tags:    

Similar News